Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శశి ఫ్యూచర్ మసి బారినట్టేనా? పిక్చర్ అభీ బాకీ హై!]
posted on: Feb 14, 2017 1:11PM

శశికళ.... శశి... చిన్నమ్మ... ఈ పేర్లు గత కొన్ని రోజులుగా మీడియాలో మార్మోగిపోయాయి. తమిళ మీడియా సంగతి తెలియదు కాని... తెలుగు మీడియా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ, రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టు ఉధృతంగా కవరేజ్ ఇచ్చాయి. కాని, ఇవాళ్ల సుప్రీమ్ తీర్పుతో శశికళ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? ఇక పన్నీర్ సెల్వమ్ దే హవానా? అఫ్ కోర్స్ , కాదంటున్నారు రాజకీయ అనుభవం వున్న వారు! శశికి తీర్పు వల్ల గ్రహణం పట్టిందే తప్ప అమావాస్య ఏం వచ్చేయలేదంటున్నారు! కొద్ది రోజులు మసకబారి శశి మళ్లీ తన వెన్నల చెన్నై రాజకీయాల మీద ప్రసరిస్తుందంటున్నారు...
శశికళ జైలుకి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చు.
కాని, ఈ నాలుగేళ్లలో ఆమె వర్గం అన్నాడీఎంకేలో లేకుండా పోతుందా? నో ఛాన్స్. శశికళ వీర విధేయులు పార్టీలోనే వుంటారు. పన్నీర్ సెల్వానికో, మరో ముఖ్యమంత్రికో... ఎవరికైనా సరే పంటి కింద రాళ్లలానే కొనసాగుతారు. చిన్నమ్మ జైలు నుంచి ఇచ్చే ఆర్డర్స్ వీలైనంత పాటించే ప్రయత్నం చేస్తారు! ఇక పన్నీర్ సెల్వం జయకు విశ్వాసపాత్రుడైన బంటే గాని... వారసుడు కాదు. ఆమెకున్న పార్టీపై వున్న పట్టుగాని, ప్రజల్లో వున్న ఫాలోయింగ్ కాని... రెండూ ఈ సాధు జీవికి లేవు! కాబట్టి పదే పదే ఏఐఏడీఎంకే రెబెల్స్ రెచ్చిపోవచ్చు. అప్పుడు వారికి శశికళే అండగా కనిపిస్తుంది. జయ తరువాత అంతో ఇంతో గట్టి పట్టున్న వ్యక్తి ఆమె కాబట్టి!
మొత్తం పదేళ్లు ఆమెకు సీఎం అయ్యే ఛాన్స్ లేకున్నా... నాలుగేళ్లు మాత్రమే లోపలుంటారు. అంటే పన్నీర్ సెల్వం నెక్స్ట్ ఎలక్షన్స్ ఎదుర్కొనెందుకు రెడీ అవుతుంటే చిన్నమ్మ జైలు గేట్లు తీసుకుని బయటకు వస్తారు. వచ్చీరాగానే పార్టీని చీల్చి తన వర్గంతో ఎన్నికలకు వెళితే ఆమెను ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యురాలిగా చూడరు. ప్రభుత్వ వ్యతిరేకత అంతా పన్నీర్ పైనే వుంటుంది. శశి ఫ్రెష్ గా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టుకోవచ్చు!
జైలుకి వెళ్లొచ్చిన శశిని జనం అదరిస్తారా? జైలు నుంచి చిన్నమ్మ చక్రం తిప్పగలదా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు ఇంకా మిగిలే వున్నాయి. అలాగే, పన్నీర్ జయ మృతిపై దర్యాప్తు చేయించి శశికళని కొత్త కేసుల్లో, ఆరోపణల్లో ఇరికించ వచ్చు కూడా! కాబట్టి ముందు ముందు శశికళకి రాజ మార్గం ఏం లేదు. అలాగని ఆమెకు ది ఎండ్ ఎదురైపోయినట్టు కూడా భావించరాదు! ది యాక్సువల్ గేమ్ హాజ్ జస్ట్ బిగాన్!






