Top Stories

బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీ విన్యాసాలు.. సుమోటాగా కేసు నమోదు

హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీతో భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం అర్దరాత్రి కొందరు యువకులు ఓ పెన్ టాప్ జీప్ లో చేసిన రచ్చ సృష్టించారు.  ఏకంగా జీపు డ్యాష్ బోర్డుపై తుపాకీకి ఉంచి చేసిన విన్యాసాలను చిత్రీకరించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. సుమోటాగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ తీసిన అకతాయి అప్సర్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్  చేశారు. అతడితో పాటు తుపాకీ విన్యాసాలను చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులో తీసుకున్నారు       హైద్రాబాద్ లో తుపాకీతో హడావుడి చేయడం కొత్త కాదు. అనేక చోట్ల ఇలా విన్యాసాలు చేయడం మామూలైంది. 2022 అక్టోబర్ లో   బహదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ  యువకుడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. యుపిఐ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పి వెళ్లిపోతుండగా బంక్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆ యువకుడు మరో ఇద్దరు యువకులను పిలిపించి   బంక్ సిబ్బందిపై దాడి చేశాడు. వచ్చిన ఇద్దరుయువకుల్లో ఒకరివద్ద గన్ ఉంది. సిబ్బందికి గన్ చూపిస్తూ నానాహంగామా చేశాడాయువకుడు. ఈ ఘటనలో పోలీసులు ఇప్తెకార్ ను అరెస్ట్ చేశారు.  2021 మార్చిలో తెలంగాణ భవన్ లో    టిఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్ మాజీ అధ్యక్షుడు   కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఎంఎల్సి ఎన్నికల సంబురాల్లో తన లైసెన్స్ గన్ తీసి  గాల్లో  కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. కార్యకర్తలు వారించడంతో గన్ లోపల పెట్టుకున్నాడు. 2024లో బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద  కొందరు యువకులు తుపాకీతో రోడ్ల మీద తిరిగారు.    2016 మార్చిలో  నకిలీ పోలీస్ డమ్మీ రివాల్వర్ తో హల్ చల్ చేశాడు ప్రేమ జంటలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నకిలీ పోలీస్ ను ఎన్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ సంవత్సరం జనవరిలో బీదర్ ఎటిఎం దొంగల ముఠా అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యారు.  హైద్రాబాద్ లో సంఘ విద్రోహశక్తులు తుపాకీలతో విన్యాసాలు చేస్తున్నా పౌరులు  సామాజిక బాధ్యతగా స్పందించి పోలీసులకు సమాచారం ఇస్తున్న దాఖలాలు లేవు. తాజాగా బంజారాహిల్స్ లో అకతాయిల విన్యాసాలపై పోలీసులకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ అయినదాన్ని పోలీసులే స్పందించి సుమోటాగా కేసు నమోదు చేయాల్సి వచ్చింది.   
బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీ విన్యాసాలు.. సుమోటాగా కేసు నమోదు Publish Date: Mar 29, 2025 12:40PM

మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాతో మోడీ టాప్!

దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ నంబర్ వన్ గా నిలిచారు. ఒక ఆంగ్ల దినపత్రిక 2025 సంవత్సరానికి దేశంలో వంద మంది మోస్ట్ పవర్ పుల్స్ ఇండియన్స జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నది మోడీ మాత్రమే. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో విదేశాంగ మంత్రి జైశంకర్ మూడో స్థానంలో నిలవగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్ నాలుగో  స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు.  ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు 14వ స్థానంలోనూ, రేవంత్ రెడ్డి28వ స్థానంలోనూ నిలిచారు, అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కూడా స్థానం దక్కింది. ఇంకా ఎంఐఎం అధినేత అసదుద్దీన్  ఒవైసీకి కూడా  మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో చోటు దక్కింది. ఇంకా వ్యాపార దిగ్గజాలు రిలయన్స ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ,  ఇంకా  ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి స్థానం సినీ హీరో అల్లు అర్జున్ కు కూడా స్థానం దక్కింది. ఈ జాబితాలో 98వ స్థానం దక్కింది.  
మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాతో మోడీ టాప్! Publish Date: Mar 29, 2025 12:35PM

అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు.. ఏప్రిల్ 9న శంకుస్థాపన

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందు కోసం ఆయన వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ6 రోడ్డుకు ఆనుకుని ఉండే ఈ స్థలానికి నాలుగువైపులా రోడ్డు ఉంది. అంతే కాకుండా అమరావతిలో కీలకమైన సీడ్  యాక్సెస్ మార్గానికి చేరువగా ఉంది. హైకోర్ట్, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్జీవోల నివాససముదాయాలు చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి కేవలం రెండు కీలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఐదు ఎకరాల స్థలంలో ఇంటిట నిర్మాణంతో పాటు ఉద్యానవనం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి వాటికి వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక సాధ్యమైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానున్న సంగతి తెలిసిందే. ఆ లోపుగానే తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయాలని భావిస్తున్న చంద్రబాబు అందుకు ఏప్రిల్ 9 ముహూర్తంగా నిర్ణయించారు.  
అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు.. ఏప్రిల్ 9న శంకుస్థాపన Publish Date: Mar 29, 2025 12:11PM

తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం.. ఒక ప్రభంజనం!

భారత రాజకీయాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఒక ప్రభంజనం.  రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్. ఒక ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎకఛత్రాధిపత్యానికి చరమగీతం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.  ఆవిర్భావమే ఒక ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలలకే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతేనా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ సోపానంగా మారింది. ప్రజల దగ్గరకు రాజకీయాలను నడిపించింది. వారినే రాజకీయ నిర్ణేతలుగా మార్చింది. రాజకీయం అంటే ఆధిపత్యం కాదు.. ప్రజా సేవ అని చాటింది.   తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆదర్శం, సందేశం ఆచరణ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సిద్థాంతానికి కట్టుబడి గత నాలుగు దశాబ్దాలకు పైగా రాష్ట్ర, దేశ రాజకీయాలలో అత్యంత క్రియాశీలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే.  అటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ఘనంగా జరుపుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. తెలుగు వాళ్లు ఉన్న ప్రతి రాష్ట్రం, దేశంలో కూడా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో హైదరాబాద్ లో సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు అంటే మార్చి 29న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడుపోసుకున్న తెలుగుదేశం.. ఈ 43 ఏళ్లుగా తెలుగువాడి వాడివేడి సత్తా చాటుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ప్రవేశం చేసిన ఎందరో నేతలు ప్రజాసేవలో ఒదిగి ఎదిగారు.   43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలల వ్యవధిలోనే  ఉమ్మడి ఏపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న టీడీపీ… ఆ వెంటనే  అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటిలత్వం కారణంగా అధికారానికి దూరం అయ్యింది. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో కాంగ్రెస్ దిగివచ్చి మళ్లీ పువ్వుల్లో పెట్టి తెలుగుదేశం కు అధికారం అప్పగించింది. ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమే ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యదక్షత, దీక్షను ప్రపంచానికి చాటింది.  ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకుంది.  దేశానికి రాష్ట్రపతి నుంచి ప్రధానులుగా ఎవరుండాలో నిర్దేశించింది.   అటువంటి పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిన పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ జరుపుకునే పొండుగ ఒక్క తెలుగుదేశం ఇఆవిర్బావ దినోత్సవం మాత్రమేనని చంద్రబాబు అన్నారు.  43 ఏళ్లుగా కష్టనష్టాలలో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని పార్టీతో నడుస్తున్న నేతలు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు  ఈ సందర్బంగా చెప్పారు.  పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా ముందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నామనీ,  ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. తానూ అదే  ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నానన్నారు.    సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు.   తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ. టెక్నాలజీని అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటాలే కారణమన్నారు.  2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించినా కార్యకర్తలు జెండా వదల్లేదు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే... అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం. 43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం. త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ కేడర్ నిలబడ్డారని అన్నారు. 
తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం.. ఒక ప్రభంజనం! Publish Date: Mar 29, 2025 11:28AM

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 15 మంది మావోలు హతం

వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  దండకారణ్యంలో శనివారం (మార్చి 28) ఉదయం కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గోగుండా హిల్ పై మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ జరిపాయి. ఆ సందర్భంగా కెర్ల పాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను గమనించగానే ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పులలో 15 మంది నక్సలైట్లు హతమయ్యారు.  ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో డిస్ట్రిక్ట్ రిజర్వ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లు పాల్గొన్నాయి.
ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 15 మంది మావోలు హతం Publish Date: Mar 29, 2025 10:55AM

ఒక రోజు పోలీసు కస్టడీకి వంశీ!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ద్వంసం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను ఎస్టీఎస్టీ అట్రాసిటీస్ కోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూవివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు గన్నవరం కోర్టులో దాఖలు చేసిన  పిటిషన్ ను విచారించిన కోర్టు వంశీని ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు శనివారం (మార్చి 29) తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.   
ఒక రోజు పోలీసు కస్టడీకి వంశీ! Publish Date: Mar 29, 2025 10:39AM