లక్ష్యం సాధించాలంటే ఈ నియమాలు పాటించాలి..!

 

జీవితంలో ఏ లక్ష్యము లేనివారిని సోమరిపోతులు అంటారు.  జీవితంలో గొప్ప లక్ష్యాలు సాధించాలని వాటి కోసం కృషి చేసేవారిని సమాజం,  సమాజంలో అందరూ కూడా గౌరవిస్తారు. కష్టపడేవారే లక్ష్యాలు చేరుకోవడంలో విజయవంతం అవుతారు. అందుకే వీరు విజేతలు కూడా అవుతారు.  కానీ లక్ష్యాలు సాధించాలనే తపన ఉండి, కష్టపడుతూ వాటిని సాధించలేనివారు కొందరు ఉంటారు.  అలాంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన నియమాలు పాటిస్తే జీవితంలో తప్పకుండా లక్ష్యాలు సాధించి విజేతలు అవుతారు.

ఆచార్య చాణక్యుడు భారతదేశం గొప్పగా చెప్పుకోదగినవాడు.  ఆయన దేశంలోని గొప్ప  పండితులలో ఒకరు.  ఆయనను కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు.  ఆయన రాజికీయాల గురించి మాత్రమే కాకుండా  ఆర్థిక శాస్త్రం,  యుద్ద వ్యూహం,  జ్యోతిష్యశాస్త్రం, జీవితానికి సంబంధించిన చాలా విషయాల గురించి ఎన్నో వాస్తవాలను చెప్పారు. ఈ కారణంగా ఈయన నీతిశాస్త్రం చాలా పేరు పొందింది.

లక్ష్యాలు చేరుకోవాలన్నా, విజేతలు కావాలన్నా మనసులో ఉన్న విషయాలను, ఆలోచనలను ఎప్పుడూ మాటల ద్వారా వ్యక్తం చేయకూడదట.  పనిని పూర్తి చేయడానికి ఏ వ్యూహాన్ని అయితే ఎన్నుకుంటారో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ పని  చేయాలంట.  పని తొందరగా అవ్వడం లేదని ప్రతి సారి లక్ష్యాలను చేరుకోవడానికి వేరే మార్గాలు ఎన్నుకుంటే ఏ వ్యూహాన్ని ఆశిచినంతగా అమలు పరచలేరట.  అందుకే లక్ష్యం సాధించాలంటే పదే పదే మార్గాలు మార్చడం కాదు.. ఒక మార్గంలో ఎక్కువ శ్రమ చేయాలి.

జీవితంలో సంతోషంగా ఉండటం వల్ల  లక్ష్యాలు సాధించడం వీలవుతుంది.  ఈ సంతోషం  ఎలా లభిస్తుంది అంటే మనసులో ఉన్న అన్ని విషయాలను అందరికీ చెప్పకుండా మౌనంగా ఉన్నప్పుడు.  కొందరికి మనసులో ఏ విషయం ఉన్నా దాన్ని దాచుకోలేరు.  పుటుక్కున బయటకు చెప్పేస్తుంటారు. అందుకే మనసులో ఉండే విషయాలను ముఖ్యంగా రహస్యాలను అస్సలు బయటకు చెప్పకూడదు.

చేయాలని అనుకన్న పని గురించి తప్ప వేరే దేని గురించి ధ్యాస ఉండకూడదు.  దీని వల్ల విజయం సాధించడం సులువు.  లక్ష్యం వైపు ఎక్కువ దృష్టి పెట్టి శ్రమించవచ్చు కూడా. అలా కాకుండా లక్ష్యం ఒకటి అయితే మనసులో వేరే విషయాల గురించి ఆలోచన ఉంటే ఎప్పటికే లక్ష్యాన్ని చేరుకోలేరు.  పూర్తిగా సంపూర్ణ విజయం సాధించలేరు. ఈ నియమాలు తెలుసుకుని పాటిస్తే జీవితంలో విజేతలు కాకుండా ఎవరూ ఎవరినీ అడ్డుకోలేరు.


                                      *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu