Top Stories

తిరుమల ప్రక్షాళన.. తగ్గేదేలే.. తిరుమలలో పారిశుద్ధ్యం మెరుగునకు టెక్నాలజీ

తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టగానే తొట్ట తొలిగా తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. వైసీపీ హయాంలో  తిరుమల పారిశుద్ధ్యం సహా ప్రతి విషయంలోనూ అస్తవ్యస్థంగా తయారైంది. అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం నుంచీ, తిరుమల ప్రసాదంలో కల్తీ వరకూ నానా రకాలుగా భ్రష్టుపట్టించారు. దీంతో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టగానే తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలో పర్యటించిన చంద్రబాబు ఆ సందర్భంగా తిరుమల ప్రక్షాళన తొలి ప్రాథాన్యత అని చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే తిరుమల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారు. కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత పెంపు నుంచి మొదలు పెట్టి.. వరుసగా తిరుమలలో పవిత్రత పెంచే విధంగా వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా తిరుమల కొండపై వసతి గృహాలు, కాటేజీలలో శుభ్రద పెంపు, ఫిర్యాదుల పరిశీలన, గదుల కేటాయింపు తదితర విషయాలపై టీటీడీ దృష్టి సారించింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులు టీటీడీ వసతి గృహాలను ఖాళీ చేసిన ఎంత సమయం తరువాత ఆ గదులను ఇతరులకు కేటాయిస్తున్నారు. గదులలో శుభ్రత, భక్తుల ఫిర్యాదులు వంటి సమాచారం వెంటనే తెలిసేలా యాప్ రూపొందించాలని ఆదేశించారు. గదుల కేటాయింపులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.   ప్రధానంగా తిరుమలలో భక్తులకు శీఘ్రదర్శనం, గదుల కేటాయింపు, శుభ్రత తదితర అంశాలపై ఇటీవల అధికారులతో చర్చించారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలనీ, లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద జాప్యం లేకుండా లడ్డూల పంపిణీ జరగాలన్నారు.
తిరుమల ప్రక్షాళన.. తగ్గేదేలే.. తిరుమలలో పారిశుద్ధ్యం మెరుగునకు టెక్నాలజీ Publish Date: Apr 7, 2025 10:26AM

వీధికుక్కల దాడిలో బాలుడి మ‌ృతి.. గుంటూరులో విషాదం

వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఆదివారం ఓ వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. వీధికుక్కల నియంత్రణలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వీధికుక్కల స్వైర విహారంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదేని స్థానికులు విమర్శిస్తున్నారు. తాజా ఘటనలో ఆదివారం (ఏప్రిల్6) సాయంత్రం నాలుగు గంటల సమయంలో చర్చి నుంచి బయటకు వచ్చిన ఐజాక్ అనే బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఐజాక్ ఆస్పత్రిలో మరణించడంలో స్వర్ణ భారతి నగర్ లో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.  నాగరాజు, రాణిమెర్సి దంపతుల  మూడో సంతామైన ఐజాక్.. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లాడు. మూత్ర విసర్జన కోసం చర్చి బయటకు వచ్చిన ఐజాక్ పై ఓ వీధికుక్క దాడి చేసింది.  బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లి వదిలేసింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఐజాక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.   ఈ ఘటన అనంతరం ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఇలాంటి దారుణం మరెక్కడా, ఎవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణం స్పెషల్ డ్రైవ్ చేపడతామని మునిసిపల్ అధికారులు అంటున్నారు. బాలుడి మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 
వీధికుక్కల దాడిలో బాలుడి మ‌ృతి.. గుంటూరులో విషాదం Publish Date: Apr 7, 2025 10:04AM

సీపీఎం నూతన సారథి ఎం.ఎ. బేబీ

సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది.  . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.  తమిళనాడులోని చారిత్రాత్మక నగరమైన మధురైలో గత ఐదు రోజులుగా జరుగుతున్న పార్టీ 24వ మహాసభ ముగింపు రోజైన ఆదివారం (ఏప్రిల్6) పార్టీ ప్రతినిథులు సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏబేబిని ఏకగ్రీవంగా   ఎన్నుకున్నారు. సుదీర్భ రాజకీయ అనుభవం ఉన్న ఎంఏ బేబీ సీపీఎం  ఆరవ ప్రధాన కార్యదర్శిగా పార్టీని ముందుకు నడిపించనున్నారు. సీతారాం ఏచూరి హఠాన్మరణం తరువాత సీపీఎం సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు అయిన ప్రకాష్ కరత్   తాత్కాలిక సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేటీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.   పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శి పదవి కోసం పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు, రైతు ఉద్యమాల సారథి  అశోక్ ధావలే  సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవికి గట్టిగా పోటీ పడ్డారు.అయితే రాజకీయ అనుభవం ఉన్న ఎం.ఏ. బేబీకే పార్టీ పట్టం గట్టింది.   1954లో కేరళ   జన్మించిన ఎం.ఏ. బేబీ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. పాఠశాల స్థాయిలోనే ఆయన కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ (కేఎస్‌ఎఫ్)లో చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత   కేఎస్‌ఎఫ్  స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)గా మారిన తరువాత కూడా ఆయన అందులో చురుకుగా పాల్గొనడమే కాకుండా కీలక బాధ్యతలు నిర్వహించారు.   1986 నుంచి 1998 వరకు రెండు  రాజ్యసభ సభ్యుడిగా కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచే కేరళ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండి పలుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  2012లో   సీపీఎం   పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు.  ఇప్పుడు సీపీఎం ప్రధాన కార్య దర్శిగా ఎన్నికయ్యారు. ఆయl నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
సీపీఎం నూతన సారథి ఎం.ఎ. బేబీ Publish Date: Apr 6, 2025 9:35PM

శ్రీరామ నవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో

శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది.  ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు. పట్టు చీరలు, ఆభరణాలు ధరించి ముస్తాబై  తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకోవడం, మెడలో మంగళ  సూత్రం ధరించి రాజరాజేశ్వరస్వామిని తమ భర్తగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకుంటారు.  ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మ వివాహం( స్వయం పరిత్యాగంగా) పరిగణిస్తుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేముల వాడలోని శ్రీ రాజేశ్వర స్వామి    ఆలయంలో జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో సామాన్య భక్తులతో హిజ్రాలు,  జోగినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 
శ్రీరామ నవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో Publish Date: Apr 6, 2025 6:04PM

రాములోరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి 

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరై సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది.  ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్దికి సహకారమందిస్తామని హామి ఇచ్చారు.  
 రాములోరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి  Publish Date: Apr 6, 2025 5:01PM