ప‌ప్పు అనుకున్నార్రా.. ఫైర్‌.. లోకేశ్ 2.0.. నెవ్వ‌ర్ బిఫోర్‌..

అప్పుడే 39 ఏళ్లు వ‌చ్చేశాయ్‌. తండ్రి చాటు బిడ్డ‌గా ప్ర‌స్థానం మొద‌లుపెట్టి.. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా.. ప‌దునైన రాజ‌కీయ నేత‌గా ఎదిగారు నారా లోకేశ్‌. చంద్ర‌బాబు వార‌సుడిగా.. పార్టీకి ఆశాకిర‌ణంగా.. ఉజ్వ‌లంగా ప్ర‌కాశిస్తున్నారు. బ‌డ‌బాగ్నిలా ప్ర‌జాకంట‌క పాల‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌కు చిన్న‌క‌ష్టం వ‌చ్చినా వాలిపోతున్నారు. ఒక‌ప్పుడు లోకేశ్‌ను ప‌ప్పు అంటూ లైట్ తీసుకున్న వైసీపీ.. ఇప్పుడు నిప్పులాంటి నారా వార‌సుడిని చూసి అదిరి, బెదిరిపోతోంది. అందుకే, లోకేశ్ ఎక్క‌డికి వెళితే అక్క‌డ పోలీసులు ముందుగానే రెడీగా ఉంటున్నారు. లోకేశ్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక‌.. తెగ ఇదై పోతున్నారు. లోకేశ్ అడుగుపెట్టిన చోట‌.. జ‌న‌త‌రంగం ఉప్పెన‌లా ఎగుస్తోంది. కార్య‌క‌ర్త‌ల పాలిటి నిజ‌మైన లీడ‌ర్‌.. నారా లోకేశ్‌. 

నారా లోకేశ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలుగు తమ్ముళ్లకు యువరాజు. లోకేశ్‌ది మాస్టర్ మైండ్ అంటారు సన్నిహితులు. మాట్లాడటమే రాదు, అమూల్ బాయ్ అంటారు ప్రత్యర్థులు. ఎవరేమన్నా.. లోకేశ్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు. తన పని తాను చేసుకుపోతారు. పార్టీ కోసం నిత్యం కష్టపడి పని చేస్తుంటారు. డౌట్ ఉంటే.. ఇటీవ‌లి లోకేశ్ ప‌ర్య‌ట‌న‌లు కానీ, ఆయ‌న ప్ర‌సంగాలు కానీ.. ఓసారి వినండి.. చూడండి.. లోకేశ్ ఎంత ప‌రిణితి చెందిన‌ ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌రో మీకే తెలుస్తుంది.. 

నాయ‌కుడంటే నారా లోకేశ్‌లా ఉండాలి. ఒక ఇష్యూని ఎత్తుకుంటే.. ఇక ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చివ‌రి వ‌ర‌కూ పోరాడే మ‌న‌స్త‌త్వం చాలా కొద్ది మందికే ఉంటుంది. ఏపీలో క‌రోనా స‌మ‌యంలో విద్యార్థుల ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని లోకేశ్ చేసిన పోరాటం ఆయ‌న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం. అదే, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌నే తీసుకొండి. ఆయ‌న ఏ ఇష్యూనూ చివ‌రి దాకా చేపట్టిన‌ చ‌రిత్ర లేదు. నాలుగు రోజులు హ‌డావుడి చేసి వ‌దిలేస్తారు. నారా లోకేశ్ అలా కాదు.. చంద్ర‌బాబులానే తుద‌కంటూ పోరాడుతున్నారు. 70 ఏళ్ల వ‌య‌స్సులోనూ చంద్ర‌న్న న‌వ యువ‌కుడిలా ప‌ని చేస్తుంటే.. తండ్రికి పోటీగా, సాటిగా.. నారా లోకేశ్ సైతం పందెం కోడిలా ఫైట్ చేస్తున్నారు. 

బాడీతో పాటు బాడీలాంగ్వేజ్ సైతం మార్చేశారు. స్లిమ్‌గా ఫిట్‌గా అయ్యారు. గ‌డ్డం పెంచారు. గ‌డ్డం గ్యాంగ్‌ను ఇర‌గ‌దీస్తున్నారు. బూతులు మాట్లాడ‌కుండానే దూకుడు పెంచేశారు. శారీర‌కంగా, మాన‌సికంగా రాటుదేలారు. తండ్రి బాట‌లోనే పోరు ప‌థం ఎంచుకున్నారు. ఆయ‌న మాట‌లు, చేష్ట‌ల్లో వాడి-వేడి పెరిగింది. ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లాలో ఫాక్ష‌న్ జంట హ‌త్య‌ల స‌మ‌యంలోనూ లోకేశ్ బెబ్బులిలా గ‌ర్జించారు. ఎవ‌రినీ వ‌దిలిపెట్టాం.. వేటాడుతాం.. అంటూ జ‌గ‌న్‌రెడ్డికి ఫ్యాక్ష‌న్ త‌ర‌హాలోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌హిళ‌ల‌పై అరాచ‌కాల‌పై స‌ర్కారును చెడుగుడు ఆడుకున్నారు. బాధితుల‌కు నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో త‌ప్పుల‌ను, వైసీపీ అరాచ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు. నారా లోకేశ్ ట్విట‌ర్ అకౌంట్ ఓసారి చెక్ చేయండి.. ఆయ‌న దూకుడేంటో తెలుస్తుంది.. 

నారా లోకేశ్‌.. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉన్న నాయ‌కుడు. విద్యార్థిలోకం ఆయ‌న్ను త‌మ నాయ‌కుడిగా భావిస్తోంది. యువ‌త ఆయ‌న వెన్నంటే నిలుస్తోంది. ఊరూరా లోకేశ్ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. నారా లోకేశ్‌.. ద‌మ్మున్న‌ డైన‌మిక్ లీడ‌ర్‌. ప్రతిపక్షం ఎగతాళి చేస్తున్నట్టు పప్పు కాదు.. ఫైర్. దమ్ముంటే టచ్ చేసి చూడండి.. కాలిపోద్ది అంటూ సవాల్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. లోకేశ్ 2.0.. నెవ్వర్ బిఫోర్.