Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీ రాజీడ్రామాలు ఆపండెహె...
posted on: May 19, 2014 3:22PM
.jpg)
నరేంద్ర మోడీ చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయినప్పటికీ పలువరు రాజకీయ నాయకులు కుళ్లు అండ్ చద్ది రాజకీయాలు చేయడం మానుకోవడం లేదు. ఎప్పుడో కాలం చెల్లిన రాజకీయ ట్రిక్కులు ప్రదర్శిస్తూనే వున్నారు. ఇంత ఔట్ డేటెడ్‌గా వున్నారు కాబట్టే మోడీ వీళ్ళందరికీ జెల్ల కొట్టి కేంద్రంలో బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, మోడీ ఘన విజయం సాధించగానే చాలా పార్టీలకి, వారి నాయకులకు కళ్ళు తిరిగిపోయాయి. అసలేం జరిగిందో కూడా అర్థంకానంత షాక్‌కి గురయ్యారు. మెల్లగా తేరుకున్న తర్వాత వాళ్ళ టైపు ఓల్డు మార్కు రాజకీయాలు ఆడటం ప్రారంభించారు. ఆ ఆటలో ప్రధాన అంశం రాజీడ్రామా. తాము ఈ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయామని తెలుసుకున్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన సోనియా, రాహుల్ చిరునవ్వులు చిందిస్తూ ఓటమిని అంగీకరిస్తున్నామని చిలక పలుకులు పలికారు. ఆ మర్నాడు ఇద్దరూ రాజీనామాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హమ్మయ్య దేశానికి పట్టిన దరిద్రం మరికాస్త వదలబోతోందని ఆనందిస్తూ వుండగానే, కాంగ్రెస్ పార్టీ అలాంటిదేమీ లేదు, వీళ్ళిద్దరూ రాజీనామా చేయబోవడం లేదని వివరణ ఇచ్చింది. అలాగే ఇలాంటి మరో పెద్దమనిషి నితిష్ కుమార్ భరద్వాజ్. బీహార్ ముఖ్యమంత్రి అయిన ఈయనగారికి మోడీ ఇచ్చిన షాక్‌తో కళ్ళు గింగిరాలు తిరిగాయి. దాంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేశాడు. జేడీయూ వర్గాలు నువ్వు తప్ప మరొకడు బీహార్ని ఏలలేడంటూ నితిష్ గడ్డం పట్టుకుని బతిమాలడంతో ఆయన మనసు మార్చుకునే యోచనలో వున్నాడట. అలాగే తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి స్టాలిన్ కూడా ఇలాంటి రాజీడ్రామానే ఆడాడు. జయలలిత చేతిలో దారుణ ఓటమి గురి కావడంతో హర్టయిపోయిన ఆయన తన పార్టీ పదవికి రాజీనామా చేసేశాడు. ఇంతలో పార్టీ కార్యకర్తలందరూ ఆయన కాళ్ళమీద పడి బతిమాలుకునేసరికి కరిగిపోయి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రాజకీయ నాయకులు ఇలాంటి రాజీనామా డ్రామాలు ఇంకా ఎంతకాలం ఆడతారో ఏంటో.


.jpg)
.jpg)


