Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ షాక్...
posted on: Sep 26, 2019 10:51AM

తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని నిర్ణయిస్తూ ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తమ కుమార్ రెడ్డి తన సతీమణి కి కాంగ్రెస్ టికెట్ కేటాయించి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి కి సోనియా గాంధీ షాకిచ్చారు. రేవంత్ రెడ్డి తన అనుచరుడు అయిన శ్యామల్ కిరణ్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ కి నివేదించుకున్నా సోనియగాంది కనికరం చూపలేదు. దీంతో పిసిసి లో ఉత్తమ్ మాటకు తిరుగులేదని తేలిపోయింది. హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోదాడ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. కోదాడ నుంచి టీ.ఆర్.ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపొందారు.
రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్టోబర్ ఇరవై ఒకటిన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ అక్టోబర్ ఇరవై నాలుగున జరగనుంది. ఇక టీ.ఆర్.ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైది రెడ్డిని సీ.ఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సైదురెడ్డికి సీఎం కేసీఆర్ బీఫారం కూడా అందజేశారు. ఆయన గత ఎన్నికలకు ముందు ఎన్నారై గా ఉంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావడంతో పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖగా ఉన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదన్న చర్చలు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై వేల మెజారిటీ ఖాయమని ప్రకటించాడు. దీంతో టీ.ఆర్.ఎస్ ఈ ఎన్నికను ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఉత్తమ్ సొంత కోటాలో గులాబీ జెండా ఎగరవేసేందుకే టీ.ఆర్.ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మధ్యలో బిజెపి సైతం గణనీయంగా ఓట్లు సాధించేందుకు రెడీ అవుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కేసీఆర్ కు సవాల్ గా మారింది.






