తాగుబోతు తండ్రిని హత్య చేసిన కొడుకు

posted on: Mar 29, 2026 6:15AM

నిత్యం తప్పతాగి తల్లిని వేధిస్తున్నాడన్న కారణంతో కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బాయిమీది తాండాలో జరిగింది. తండాలో నివాసం ఉంటున్న రాథోడ్ లోకేష్ (54) మద్యానికి బానిసై . గత కొంతకాలంగా  భార్య బిక్కీ బాయ్‌తో తరచూ గొడవలు పెట్టుకుంటూ ఆమెపై దాడులకు పాల్ప డుతున్నాడు. రోజురోజుకూ అతడి వేధింపులు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యలోనే   బిక్కీ బాయ్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న తన కుమారుడు సునీల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. తల్లి బాధలు విన్న సునీల్ రగిలిపోయాడు. వెంటనే తాండాకు చేరుకుని తండ్రిని నిలదీశాడు.  ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.  ఆ క్రమంలో  సునీల్   కర్రతో తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి లోకేష్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నిందితుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగు తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...