కన్నవారిపై తనయుడి దాడి.. తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం

posted on: Mar 23, 2026 11:31AM

కన్నవారిపై తనయుడు చేసిన దాడిలో తల్లి మరణించిన విషాద ఘటన కర్నూలు జిల్లా అవుకులో జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.   అవుకు పట్టణం కోటవీధిలో నివాసముంటున్న పుసులూరు శేఖర్, లక్ష్మీదేవి దంపతుల ఏకైక కుమారుడు రామాంజనేయులు. ఒకే కొడుకు కావడంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. అయితే పెరిగి పెద్దైన తరువాత ఆంజనేయులు తాగుడు, పేకాట వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. చదువు అబ్బలేదు. టెన్త్ తో చదువు మానేశాడు.  గని కార్మికుడిగా కొంతకాలం పని చేసి ఆ తరువాత అదీ మానేశాడు.  

తాగుడు, జూదం అలవాట్లతో  భారీగా అప్పులు చేశాడు.  ఈ నేపథ్యంలోనే ఉగాది పండుగ రోజున డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో రామాంజనేయులు తల్లిదండ్రులపై కర్రతో దాడి చేశాడు. విచక్షణారహితంగా కర్రతో అతడు కొట్టిన దెబ్బలకు పుసులూరు శేఖర్, లక్ష్మీదేవీ తీవ్రంగాగాయపడ్డారు.

బంధువులు వారికి తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  తల్లి లక్ష్మీదేవి ఆదివారం (ఫిబ్రవరి 22) కన్నుమూశారు. తండ్రి శేఖర్  పరిస్థితి విషమంగా ఉంది.  కాగా ఈ ఘటన తరువాత రామాంజనేయులు పరారీలో ఉన్నాడు.  పోలీసులు నిందితుడి  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...