Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మిత్రధర్మం అంటే ఇదేనా...!
posted on: Jan 29, 2018 11:31AM

మిత్రధర్మం అంటే కొత్త అర్దం నేర్పుతుంది బీజేపీ పార్టీ. ఇటీవల సీపీఐ నేత రామకృష్ణ బీజేపీ వ్యవహరిస్తున్న తీరును చూసి.. మోడీకి టీడీపీ కట్టుకున్న పెళ్లం.. వైసీపీ ఉంచుకున్న పెళ్లం అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చూడబోతే అది నిజం చేసేలాగే ఉంది బీజేపీ. నిజానికి బీజేపీ-టీడీపీ మిత్రపక్షమని అందరికీ తెలిసిందే కదా. కానీ గత కొద్దికాలంగా ఈరెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిన నిజమే. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు విడిపోవచ్చని.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చన్న వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు... ఈ క్రమంలోనే బీజేపీ-వైసీపీ పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో సోము వీర్రాజు ఒకపక్క.. విజయసాయిరెడ్డి మరోపక్క మద్యలో జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ కూర్చొని ఉన్నారు. దీంతో రెండు పార్టీల డ్రామా మరోసారి బయటపడింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. స్వామిజీ ఏం చెబుతున్నారో తెలియదు కానీ... ఇద్దరూ చాలా శ్రద్దగా వింటున్నారు. అంతేకాదు... జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో ఏం చేస్తున్నారో అని కామెంట్లు కూడా విసురుకుంటున్నారు.
ఏదీ ఏమైనా ఇప్పుడు ఈ ఫొటోలు బయటపడటంతో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ పవిత్ర కలియిక , ఇప్పడు హైలైట్ అయ్యింది. ఒకపక్క తెలుగు దేశంతో మిత్రపక్షంలో ఉండి.. మిత్రధర్మ పాటిస్తున్నాం అని ఎగిరెగిరి పడే సోము వీర్రాజు.. టీడీపీ తో మిత్రపక్షంలో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏదైనా అంటే...టీడీపీపై చంద్రబాబుపై విమర్సలు గుప్పించడం. ఇక టైం వచ్చేసింది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా అసలు రంగులు బయట పెట్టేస్తున్నారు... కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలిసి పూజలు చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందో... లేకపోతే ఎలాగూ నిజం బయటపడింది ఏమన్నా లైట్ తీసుకుంటారో చూద్దాం ఏం జరుగుతుందో... ఏదేమైనా బీజేపీ మిత్రధర్మ అంటే కొత్త అర్ధాన్ని చెప్పింది. ఇదే "కొత్త మిత్ర" ధర్మం..






