Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎస్సై భార్య ఆత్మహత్య
posted on: Mar 18, 2026 12:36PM
.webp)
కరీంనగర్ టూటౌన్ ఎస్సై భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఎస్ ఐగా పని చేస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరుపప్పును గ్రైండ్ చేసి నీటిలో కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దివ్య ఆత్మహత్యకు కుటుంబ కలహాలే లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.



.webp)


