అడవిలో అన్నలతో ఎస్పై సహపంక్తి భోజనం.. మావోయిస్టుల లొంగుబాటులో అరుదైన ఘట్టం

posted on: Mar 30, 2026 10:06AM

అడవిలో అన్నలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎస్ఐ ఉదంతమిది. ఎదురుపడితే ఎదురు కాల్పులతో ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపించుకునే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ సుహృద్భావపూరిత సందర్భం ఏంటి? అన్నలతో కలిసి ఎస్ఐ అడవిలో భోజనం చేయడానికి సందర్భం ఏంటి అంటే..ఛత్తీస్ గఢ్ కాంకార్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధంగా ఉందన్న సమచారం మేరకు పార్తాపూర్ ఎస్ఐ చతుర్వేది స్వయంగా అక్కడి అటవీ ప్రాంతానికి వెళ్లారు.

  కాలినడకన వస్తున్న మావోయిస్టులకు ఆహారం అందుబాటులో లేదని తెలుసుకున్న ఎస్సై రామేశ్వర్‌ చతుర్వేది, మానవతా దృక్పథంతో వారికి భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారితో కలిసి అడవిలోనే భోజనం చేశారు. కాగా  పార్తాపూర్‌ ఏరియా కమిటీకి చెందిన రాధిక కుంజం, సందీప్‌ కడియం, రైను పద్మ అనే ముగ్గురు మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో ఆదివారం (మార్చి 29) పోలీసులకు సరెండర్ అయ్యారు.  ఆ సందర్భంగా ఎస్ఐ వారిపట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించిన తీరు సర్వత్రా మన్ననలు అందుకుంటోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...