Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిడిపితో బీజేపీ పొత్తు దేశానికి మంచిది కాదు: శివసేన
posted on: Mar 9, 2015 10:36AM
.jpg)
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాశ్మీరు వేర్పాటువాదులను జైలు నుండి విడుదల చేయడంపై ప్రతిపక్షాలతో బాటు బీజేపీకి మిత్రపక్షమయిన శివసేన పార్టీ కూడా తీవ్రంగా విమర్శించింది. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుపనిచ్చినందుకు పాకిస్తాన్ తీవ్రవాదులకు, కాశ్మీర్ వేర్పాటువాదులకు కృతజ్ఞతలు తెల్పిన ముఖ్యమంత్రి సయీద్, మొన్న శనివారం రాత్రి కొందరు కరడుగట్టిన వేర్పాటువాదులను జైలు నుండి విడిచిపెట్టారు.
దానిపై శివసేన అధినేత ఉద్దావ్ థాక్రే స్పందిస్తూ, తన సామ్నా పత్రికలో అటువంటి పార్టీతో బీజేపీ కలిసిపనిచేయడాన్ని తప్పుపట్టారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సయీద్ తన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి కానీ భారత ప్రభుత్వానికి గానీ తెలియజేయకుండా వేర్పాటువాదులను జైలులో వదిలివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన చర్యలు దేశాన్ని అవమానపరిచేవిగా, భారత ప్రభుత్వానికి సవాలుచేస్తునట్లున్నాయని శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ థాక్రే అభిప్రాయపడ్డారు. కనుక సయీద్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆయన ప్రభుత్వంలో కొనసాగడంపై బీజేపీ పునరాలోచించుకోవాలని ఉద్దావ్ థాక్రే బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసారు.


.jpg)
.jpg)


