ట్రీ ఐసోలేషన్  సక్సెస్.. శివకు నెగిటివ్.. 

ఈ ప్రపంచం లో దైర్యం కంటే గొప్ప మందు ఇంకోటి లేదు. ఎందుకంటే ఏదో జరోగుతుందని ప్యానిక్ అవ్వడం వల్ల ఇంకా ప్రాబ్లమ్ వచ్చి పడుతుంది. కానీ, దాని వల్ల ఎలాంటి లాభం ఉండదు. తాజాగా నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ గతంలో ట్రీ ఐసోలేషన్‌ పాటించిన సంగతి విదితమే. అతడికి 12 రోజులకే కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కుటుంబంలో నలుగురు సభ్యులు, ఇంట్లో ఒక్కటే గది ఉండడం, కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో చెట్టుపై ఆవాసం ఏర్పరచుకున్న శివ అనే యువకుడు కరోనాను జయించాడు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామానికి వచ్చేసిన అతడు కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లగా కరోనా సోకింది.

ఇంట్లో నలుగురు కుటుంసభ్యులు ఉంటుండటంతో తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని ఆలోచించిన శివ ఇంటి ముందున్న గానుగ చెట్టును ఐసోలేషన్‌కు వినియోగించుకున్నాడు. నులక మంచాన్ని చెట్టుపై ఏర్పాటుచేసుకుని భోజనం, నిద్ర అన్నీ అక్కడే కానిచ్చేశాడు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అతడిని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హోం ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

తాజాగా శివకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంపీపీ బాలాజీ, సర్పంచి కొత్త మరెడ్డి, ఎస్సై వీరశేఖర్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ ఉపేందర్‌, వైస్‌ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపీనాధ్‌ తదితరులు సోమవారం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ట్రీ ఐసోలేషన్‌‌తో కరోనాను జయించిన శివ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

కోవిద్ ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కొంచం దారుణంగా ఉన్నా కూడా ప్రజల్లో అవగాహనా రావడం.. మొదటి విడతో లాగ ఊర్లోకి రానివ్వకపోవడం వంటి పనులు చేయడం లేడు. 
కానీ ఈ టైం లో అందరూ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కరోనా వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మనుషులు ఎఫెక్ట్ అవుతున్నారు. అందరూ శివ ని ఆదర్శనంగా తీసుకుని దైర్యంగా ఉండాలి. 
కంగారు పడకుండా డాక్టర్స్ పరివేక్షణలో చికిత్స తీసుకుంటే కరోనా భారీ నుండి మనం తప్పించుకోవచ్చు.