ఇక షిండే, ఫ‌డ్న‌వీస్ ల యాత్ర‌

ముఖ్య‌మంత్రి షిండే, ఉప ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ వంటి దిగ్గ‌జాలు వుండ‌డంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గ‌గ‌లిగింది. వారికి వున్న భారీ మ‌ద్ద‌తు ప‌ట్ల ప్ర‌తిప‌క్ష శివ‌సేన‌, ఎన్‌సిపి, కాంగ్రెస్ ల‌కు ఎలాంటి సందేహం వుండ‌న‌క్క‌ర్లేదు. స్పీక‌ర్ ప‌ద‌వికి  గ‌త వారం జ‌రిగిన ఎన్నిక  మ‌హా ప్ర‌భుత్వం సుమారు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలుగా ప‌న్నుతున్న వ్యూహాన్ని తెలియ‌జేసింది. మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొత్త స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో స్ప‌ష్ట‌మ‌యింది. షిండే,  ఫ‌డ్న‌వీస్‌ల ప్ర‌యాణం మున్ముందు అంత సుల‌భ‌సాధ్యంగా సాగ‌కాపోవ‌చ్చు. 

షిండే ఈ ఎన్నిక‌ను మామూలుగా జ‌ర‌గాల‌నే ఆకాంక్షించిన‌ప్ప‌టికీ, గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ అందుకు ఎలాంటి అభ్యంత‌ర‌మూ చెప్పలేదు. రాజ్యాంగ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన‌వారు  ప్ర‌భుత్వం మాట‌కు త‌ల వూపి అంగీక‌రించ‌డ‌మే చిత్రం. శివ‌సేన ఎమ్మెల్యేల‌ను పెద్ద సంఖ్య‌లో ఆక‌ట్టుకోవ‌డంలో షిండే  ఘ‌న విజ‌యం సాధించింది. మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే  ఇప్ప‌టికైనా త‌న ఎమ్మెల్యేలు త‌న‌ను  ఎందుకు మోస‌గించార‌నేది తెలుసు కోవాలి.  

అధికార దాహంతో తాను చేసిన లోపాల‌వ‌ల్ల‌నే వారంతా షిండే పంచ‌న చేరార‌న్న బిజెపి అన డాన్ని థాక్రే ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. బ‌ల‌ప‌రీక్ష‌లో విప‌క్షాల ఓట్లు త‌గ్గ‌డం ఎంవిఏ నాయ‌కుల‌ను ఇబ్బందిపెట్టే అంశ‌మే. అస‌లు ఆ స‌మ‌యానికి చాలామంది స‌భ‌కు రావ‌డంలో జాప్య‌మ‌యింది. వ‌చ్చినా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగానే ఓటు వేశారు. ఏమైన‌ప్ప‌టికీ కొద్ది రోజుల్లో అన్నీ ప‌రిష్క‌రింప‌బ‌డ‌తాయి. అయితే,  షిండే ప్ర‌భుత్వం అసెంబ్లీ మిగిలిన కాలం ఎలాంటి ఇబ్బందిలేకుండా గ‌డిపేయ‌గ‌ల‌ద‌న్న‌ది ఖాయం. థాక్రే గ్రూప్‌కి ప్ర‌స్తుతం ఇది గ‌డ్డు కాలం. 

ఇక ఇపుడు షిండేకు త‌న మంత్రిమండ‌లి ఎంపిక కీల‌కంగా మారింది. పూర్తిస్థాయి మంత్రిమండ‌లిని అన్ని వ‌ర్గాలకు ప్రాతినిధ్యం క‌ల్పించేలా చేప‌ట్టాలి. రాష్ట్రంలో ఊహించ‌ని ప‌రిణామాల స‌మ‌యానికి షిండేకు ప‌లు వ‌ర్గాల ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తునిచ్చారు గ‌నుక ఇపుడు మంత్రిమండ‌లి ఎంపిక విష‌యం షిండే వ్యూహాలు ఏమాత్రం మంచి ఫ‌లితాన్నిస్తుంద‌నేది తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం థాక్రేకు మ‌ద్ద‌తుగా వున్న శివ‌సేన ఎమ్మెల్యేల‌ను మ‌ద్ద‌తు కూడా షిండే త‌న వేపు తిప్పుకోవాల్సిన అవ‌స‌రం వుంది. దీనికి మ‌రి షిండే అనుస‌రించే వ్యూహ‌మేమిట‌న్న‌ది తెలియాలి. ఈ ప‌రిస్థితుల్లో,  తానే అస‌లుసిస‌లు శివ‌సేన అధినేత ను అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు. అధికార‌గ‌ణం మ‌ద్ద‌తుతో, బాల్‌థాక్రేకి అస‌ల‌యిన రాజ‌కీయ వార‌సుడ‌ను తానే అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు. అలా ధైర్యం చేస్తేనే త్వ‌ర‌లో జ‌రిగే ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యానికి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి. బిజెపితో క‌లిసి ఈ ఎన్నిక‌లు గెలిస్తే, థాక్రే గ్రూప్ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డ‌డం ఖాయం. గ‌తంలో ఎంవిఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు, ఎన్‌సిపిగాని కాంగ్రె స్ గాని తాను ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌క‌పోవ‌చ్చ‌నే షిండే అన్నారు. వాస్త వానికి షిండే  స్వీయ బ‌లంతోనే సీఎం ప‌ద‌వి చేరుకోవ‌డంతో  ఆ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి అర్హ‌త‌ను రుజువు చేసుకున్నారు. 

ఎంవిఏ పార్టీలోనివార‌యినా, బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తునిస్తున్న‌వారిలోనైనా  ఎవ్వ‌రినీ ఏదో ఒక సిద్ధాంతం అడ్డుపెట్టుకుని చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోను వీలు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డం థాక్రే ప్ర‌భుత్వం సాధిం చిన విజ‌యంగా చెప్పాలి. రాష్ట్రంలో శాంతి, ప్ర‌జాభిప్రాయాలే ఏ సిద్ధాంతాల‌కంటే అతీత‌మ‌ని  థాక్రే  ప్ర‌భుత్వం భావించింది. అయితే ప్ర‌జ‌లు త‌న నుంచి ఏమి ఆశిస్తున్నార‌న్న‌ది షిండే కి ఎవ‌రూ ప్ర‌త్యేకించి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి సీఎం ప‌ద‌వికి చేరుకున్నా రు. మ‌రింత మంది ఎమ్మెల్యేల‌ను త‌న వేపు లాక్కోనేందుకు సీఎం ప‌ద‌వి వుప‌యోగించుకు నేట్ల‌యితే, పాల‌నా వ్య‌వ‌హారాలు స‌ర‌యిన మార్గాల్లోకి తీసుకురావ‌డం పెద్ద స‌వాలుగా మారుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏదో ఒక కార‌ణంతో ప్ర‌భుత్వం అంత గొప్ప‌గా న‌డ‌వ‌లేదు. అంతెందుకు మాజీ ఆర్ధిక మంత్రి ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించేవార‌ని షిండేనే గ‌తంలో ఫిర్యాదు చేశారు. థాక్రే పై షిండే ధ్వ‌జ మెత్తిన ప్ప‌టి నుంచీ  పాల‌నా వ్య‌వ‌హారాలు నిలిచిపోయాయ‌నాలి. పోలీసు వ్య‌వ‌స్థ నిర్వీర్య‌మైంది. అవినీతి త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. ఈ ప‌రిస్థిత్తులో మ‌ళ్లీ మ‌హారాష్ట్ర పూర్వ వైభ‌వాన్ని తీసుకురావ‌డానికి షిండే త‌ల‌నెరిసేలా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఎందుకంటే అభివృద్ధి ప‌థంలో మ‌హా రాష్ట్ర కంటే గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు ఎంతో ముందంజ‌లో వున్నాయి.  వేగిర‌మే అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట కుంటే రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలే వుండ‌వు. ఈ ప‌రిస్థితుల కార‌ణంగా షిండే, ఫ‌డ్న‌వీస్ ల‌కు మున్ముందు సుఖంగా ప్ర‌యాణించే వీలు వుండ‌దు. అడుగ‌డుగునా స‌మ‌స్య‌లు, ప్ర‌శ్న‌లు, అనుమానాల‌తోనే అంద‌రూ ఆహ్వానాలు ప‌లుకుతారు.