రాడార్లకు చిక్కని సజిల్.. ఇజ్రాయెల్, అమెరికాలకు దబిడిదిబిడే!

posted on: Mar 18, 2026 9:49AM

 పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు  మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తమ దేశంపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్  తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన సెజిల్ క్షిపణిని బయటకు తీసింది. తొలి సారిగా అమెరికా, ఇజ్రాయెల్ లోని లక్ష్యాలను ధ్వంసం  చేసేందుకు ప్రయోగించింది. ఈ సెజిల్ మిస్సైల్ కు శత్రువుల గగన తల రక్షణ వ్యవస్థలకు చిక్కుకుండా ఉండే సామర్డ్యం  ఉండటంతో అమెరికా, ఇజ్రాయెల్ ఆందోళనలో పడ్డాయి. ఆత్మరక్షణ ఎలా అన్న అయోమయంలో పడ్డాయి. ఈ సెజిల్ మిస్సైల్ ను డ్యాన్సింగ్ మిస్సైల్ అని కూడా పిలుస్తారు.  

అసలింతకీ ఈ సెజిల్ ప్రత్యేకతలేంటంటే..  ఇది ఇరాన్  పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిం చుకున్న రెండు దశల బాలిస్టిక్ క్షిపణి.  సాలిడ్ ఫ్యుయెల్ అంటే ఘన ఇంధనంతో పని చేసే ఈ క్షిపణి ప్రయోగం చాలా సులభం. మామూలు ఇంధనంతో పని చేసే క్షిపణులను ప్రయోగించడానికి గంటల తరబడి వాటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే సెజిల్ మిస్సౌల్ ప్రయోగానికి ఆ అవసరం లేదు. అత్యంత తక్కువ సమయంలోనే దీనిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. దీని వల్ల శత్రువులు దీనిని గుర్తించేలోగానే పని పూర్తయిపోతుంది.

దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది.  ఇక దీనిని డ్యాన్సింగ్ మిస్సైల్ అనడానికి కారణమేంటంటే.. ఇది గాల్లోనే తన ప్రయాణ గమనాన్ని మార్చుకోగల సామర్థ్యం ఉన్న మిస్సైల్.. ఆ కారణంగా  అత్యాధునిక రక్షణ వ్యవస్థలు కూడా దీని గమనాన్ని అంచనా వేయలేవు.  అలాగే దీనికి ఉన్న యాంటీ రాడార్ పూత కారణంగా దీనిని గుర్తించడం కూడా కష్టసాధ్యం. ఇరాన్ నుంచి ఈ క్షిపణిని పూర్తి చేస్తే ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లోని లక్ష్యాన్ని కేవలం ఏడు నిముషాల్లో చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...