Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రాజకీయ రగడ..!
posted on: Aug 7, 2026 4:41PM

బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ వివాదం..!
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పార్సిగుట్టలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ రసాభాసకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
"స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా చెక్కుల పంపిణీ ఎలా నిర్వహిస్తారు?" అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడాన్ని కూడా వారు తప్పుబట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతినినాదాలతో స్పందించారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.
ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. కార్యక్రమం వద్ద నుంచి నాయకులు, కార్యకర్తలను బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
రాజకీయ ఉద్రిక్తతల మధ్య కొంతసేపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడినా, పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ పరిణామం సికింద్రాబాద్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Secunderabad Bonala Cheque Distribution, MLA Padmarao Goud, MLC Balmuri Venkat, Adam santhosh kumar, BRS, Congress party






