మధురాతి మధురం మన ప్రేమ మధురం..!

రెండ‌క్ష‌రాల ప్రేమ మ‌నిషినేకాదు జంతు వుల‌నీ, జ‌ల‌ జీవాల‌నీ మైమ‌రిపిస్తుంది. అదో మ‌హ‌త్తు, ఆ ఆనంద డోలిక‌ల్లో జ‌ల‌ జీవి సీలు కూడా  తేలియాడింది!  తులిప్ పువ్వుల గుత్తిని త‌న ప్రియురాలికి ఇచ్చి ప్రేమ తెలియ‌జేసింది. అయితే ఐ ల‌వ్ యూ అన్న‌దా, లేదా.. వాటి  భాష‌లో ఏమ‌న్న‌దో తెలిస్తే బాగుండును. ఇంత‌కీ ఈ  ప్రేమికుల క‌ల‌యిక ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌లేదు. కానీ  దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు చూస్తే మాత్రం ఆనంద‌లో తేలి యాడతారు. అబ్బ ఎంత ముచ్చ‌ట‌గా  ఐ ల‌వ్ యూ అని చెప్పి వుంటుందోన‌న్న అందమైన ఊహ మనసులో కదలాడక మానదు.

తొలిచూపుతో ప్రేమ‌లో ప‌డేవారు, కొంత‌ కాలం ర‌హ‌స్యంగా  ఫాలో అయి  ప్రేమ‌ను ప్ర‌క‌టించేవారి గురించీ అనాదిగా  సినిమాలు, క‌థ‌లూ చెబూతూనే వున్నాయి.  కానీ  సీలు వ్య‌క్తం చేసిన అద్భుత‌మైన భావ‌న గురించి వూహిస్తేనే అదో చిత్రం! అన్న‌ట్టు ఇపుడు ఆ ఫోటోకి , వీడియోకి వేల‌మంది  ఫిదా అయ్యారు.

ఒక  పెద్ద కొల‌నులో మ‌గ సీలుగాడు  కొద్దిగా దూరం నుంచి త‌న‌వేపు తేలివ‌స్తున్న తులిప్ పువ్వుల గుత్తిని చూశాడు. ద‌గ్గ‌రికి రాగానే ఠ‌క్కున ప‌ట్టేసి  దాన్ని త‌న  ప్రియురాలి ద‌గ్గ‌రికి తీసికెళ్లింది. రెక్క‌ల్లాంటి చేతు ల‌తో దాన్ని ప‌ట్టుకుని ఎంతో ప్రేమ‌గా అందించాడు. సినిమాల్లో హీరోయిన్ ఇదే సీన్ లో హీరోయిన్ ని కొడుతుంది. ఆన‌క వాడి గురించి ఎంతో తెలుసుకుని అమాంతం ఫ్రేమించేస్తుంది! 

కానీ ఇక్క‌డ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఎంతో చ‌క్క‌టి తులిప్ పువ్వుల గుత్తిని చూసి సిగ్గుమొగ్గ‌లై  ప్రియుడి నుంచి అందుకుంది అమ్మాయి సీలుగారు!  అంతే  ఆ ఆనందంతో రెక్క‌లు కొడుతూ గుండ్రంగా తిరిగింది మ‌గ సీలు. అది చూసి అమ్మాయి సీలుగారు కూడా అలానే పువ్వులు ప‌ట్టుకుని తిరిగింది!  

అంతే రెండూ అలా వారి మ‌ధ్య ప్రేమ‌బంధాన్ని వ్య‌క్తంచేసుకున్నాయి.  ఇది చూసి తీరాల‌న్నారు నెటిజ‌న్లు. ఇంత‌టి గొప్ప ప్రేమ వ్య‌క్తీక‌ర‌ణ‌, ఇంత సున్నిత భావ‌న వ్య‌క్తం చేసిన తీరు  మ‌న‌సును ఎటో తీసికెళ్లింద‌ని  నెట్‌లో చూసిన కుర్ర‌కారు వారి వారి అనుభ‌వాలు తెగ త‌లుచుకున్నారు. ప్రేమ ఎవ‌రిద‌యినా ప్రేమే.. మ‌నుషుల యినా,  నీటి జంతువు సీలు అయినా!