Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విడిపోవడం ఎలాగో పాపం స్కాట్లాండ్ వాళ్ళకి తెలీదు...
posted on: Sep 20, 2014 12:22PM

బ్రిటన్‌లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ దేశంలో కొంతమంది వేర్పాటు వాదులు పుట్టుకొచ్చారు. మూడు వందల సంవత్సరాలుగా అంతర్భాగంగా వున్న బ్రిటన్లోంచి స్కాట్లాండ్‌ని విడదీయాల్సిందేనని ఉద్యమం లేవదీశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెల్లారిందంటే చాలు.. కొంతమంది ఓ చోట గుంపుగా చేరడం.. ప్లకార్డులు పట్టుకోవడం.. స్కాట్లాండ్‌ని విడదీయాలని నినాదాలు చేయడం! వీరి బాధ చూసిన బ్రిటన్ మొన్న 28వ తేదీన స్కాట్లాండ్ వ్యాప్తంగా రెఫరండం నిర్వహించింది. బ్రిటన్‌తో కలసి వుంటారా వద్దా అనే పాయింట్ మీద ఎస్ ఆర్ నో చెప్పేయండని అడిగింది. అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించిన రెఫరెండంలో స్కాట్లాండ్ వాసులలో మెజారిటీ జనం బ్రిటన్లోనే కలసి వుండాలని నిర్ణయించడంతో ఈ ఇష్యూకి తెరపడింది. స్కాట్లాండ్ వేర్పాటువాద ఉద్యమం ముగిసింది.
అయినా స్కాట్లాండ్ వేర్పాటువాదుల అమాయకత్వం కాకపోతే, తెలివైన వాళ్ళు ఎవరైనా శాంతియుతంగా విభజన ఉద్యమం చేస్తారా? విడిపోవాలంటే ఏం చేయాలి? బ్రిటన్ వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టిపోయాలి. స్కాట్లాండ్‌ని విభజించకపోతే మారణహోమం సృష్టిస్తామని, భూకంపం తెస్తామని బెదిరించాలి. స్కాట్లాండ్‌లో వున్న బ్రిటన్ వాళ్ళు భయభ్రాంతులు అయ్యేలా చేయాలి. స్కాట్లాండ్‌ని విభజిస్తే మీకు ఫలానా ఫలానా ఉపయోగాలుంటాయని స్థానికంగా వున్న జనాన్ని ప్రలోభపెట్టాలి. బ్రిటన్ వాళ్ళు మనని దోచేస్తున్నారని స్కాట్లాండ్ ప్రజల మనసులలో విషం నూరిపోయాలి. బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులని రెచ్చగొట్టాలి. జనం మధ్య విద్వేషాలు పెంచాలి. అధికారంలో వున్నవాళ్ళకి చాక్లెట్లు వేయాలి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పాలి. విషాన్ని పంచే సొంత మీడియాని సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి రెఫరెండంలు కాకుండా ఎలాంటి అభిప్రాయ సేకరణ, తోటకూర కట్టా లేకుండా దౌర్జన్యంగా, దుర్మార్గంగా, అన్యాయంగా విభజించే మార్గాలని అన్వేషించి, వాటిని అమలులో పెట్టాలి. అవసరమైతే స్థానిక అసెంబ్లీలలో ఎమ్మెల్యేలని, పార్లమెంటులో ఎంపీలని చావగొట్టాలి... ఇలాంటివి చేస్తే విడిపోవడం వీలవుతుందిగానీ, ఇప్పటిలా శాంతియుత ప్రదర్శనలు, రెఫరెండంలు చేస్తే స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి ఎప్పటికీ విడిపోదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు... విభజన ఉద్యమం ఎలా చేయాలో ఇండియాలోని కొంతమంది రాజకీయ నాయకులను చూసి నేర్చుకోండి. ఆ పద్ధతిలో మరోసారి ఉద్యమాన్ని మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.


.jpg)
.jpg)


