Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సత్యం రామలింగ రాజుపై రూ. 1849 కోట్ల జరిమానా
posted on: Jul 15, 2014 7:46PM
ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా నిలచిన సత్యం కంప్యూటర్స్ సంస్థ, భారీ లాభాలు ఆర్జిస్తూ భారీ బ్యాంకు నిలువలున్నట్లు చూపిస్తూ షేర్ మార్కెట్లను శాసించింది. దేశవిదేశాలకు తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించింది. దేశంలో రాష్ట్రంలో కూడా వివిధ వ్యాపార రంగాలలోకి ప్రవేశించింది. కానీ, భారీ నష్టాలలలో ఉన్న కంపెనీని ఇక ఎంతో కాలం ఈ భూటకపు పునాదులపై నిలబెట్టలేమని గ్రహించిన రామలింగ రాజు జనవరి 7, 2009న స్వయంగా తమ కంపెనీ పాల్పడిన అక్రమాలను తెలియజేస్తూ స్టాక్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కి ఒక లేఖ వ్రాయడం ఆనాడు ఒక పెను సంచలనం సృష్టించింది. వేల కోట్ల ఆర్ధిక నేరానికి పాల్పడినందుకు గాను ఆయన, ఆయన సహచరులు దాదాపు మూడేళ్ళపాటు జైలు జీవితం గడిపి కొన్ని నెలల క్రితమే బయటకి వచ్చారు. మళ్ళీ ఈరోజు వారికి అంతకంటే భయంకరమయిన షాకు తగలింది.
దాదాపు ఐదేళ్ళ విచారణ చేసిన సెబీ, తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రామలింగ రాజు, ఆయన సోదరుడు బీ.రామరాజు (సత్యం-మాజీ మేనేజింగ్ డైరెక్టర్), వదలమని శ్రీనివాస్ (సత్యం మాజీ సి.యఫ్.ఓ.), జీ.రామకృష్ణ (సత్యం-మాజీ వైస్ ప్రెసిడెంట్) మరియు వీ.యస్. ప్రభాకర్ గుప్తా (సత్యం-మాజీ హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్)లకు ఏకంగా రూ. 1849 కోట్ల జరిమానా విదించింది. వారు ఐదుగురు ఆ మొత్తాన్ని కేవలం 45రోజులలో సెబీ ఖాతాలో జామా చేయాలని ఆదేశించింది. అంతే కాక ఆ మొత్తానికి ఈ కుంభకోణం బయటపెట్టిన రోజు నుండి అంటే జనవరి 7, 2009 నుండి నేటి వరకు ఏడాదికి 12శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం కూడా విధించింది.
రామలింగ రాజే స్వయంగా ఈ కుంభకోణం బయటపెట్టిన తరువాత, ప్రభుత్వం ఆయన కంపెనీలో షేర్లు కొన్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు సత్యం కంపెనీని స్వాధీనం చేసుకొని, దానిని టెక్ మహీంద్ర కంపెనీకి అమ్మివేసింది. పూర్తిగా దివాళా తీసిన రామలింగరాజు, మిగిలిన నలుగురు ఇంత భారీ జరిమానాను కేవలం 45 రోజుఅలలో వడ్డీతో సహా చెల్లించడం అసంభవం కనుక వారు ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్లకతప్పదు. ఇటువంటి ఆర్ధిక నేరాలు పాల్పడిన వారు మన రాష్ట్రంలో దేశంలో చాలా మందే మన కాళ్ళ ముందు దర్జాగా తిరుగుతున్నారు. విదేశాలలో నల్లదనం ఎంత మూలుగుతోందో అంతకు రెట్టింపు ధనం ఇటువంటి అవినీతిపరులనుండి రాబట్టగలిగితే దేశ, రాష్ట్ర ఆర్ధికలోటును, సమస్యలను అధిగమించవచ్చును.


.jpg)
.jpg)


