Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షారుఖ్ ఇంటి ముందుకొచ్చిన సల్మాన్ కేక పెట్టాడు! ఎందుకు?
posted on: Jun 17, 2017 3:58PM

ఒకప్పుడు సినిమా రిలీజంటే ఎన్ని రోజులు ఆడుతుందోనని టెన్షన్! కాని, ఇప్పుడు వంద రోజుల, యాభై రోజుల కాన్సెప్ట్ పోయింది. హిట్టైన సినిమా కూడా మూడు వారాల తరువాత, సరిగ్గా ఇరవై ఒకటో రోజు ఎక్కడా కనిపించటం లేదు. తరువాత నెల గడవగానే టీవీలో వచ్చేస్తోంది! కాబట్టి సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు కాదు… ఎంత త్వరగా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టుకున్నాం అన్నదే ఇప్పుడు హీరోలు, దర్శక, నిర్మాతల గోలంతా! ఇందుకు బాలీవుడ్ బజ్రంగీ భాయ్ జాన్ సల్మాన్ కూడా మినహాయింపేం కాదు…
సల్మాన్ తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ని ప్రమోట్ చేసుకునే పబ్లిసిటీ తంటాల్లో వున్నాడు. అందుకే, రెగ్యులర్ గా చేసే ఇంటర్వ్యూలు, టీవీ షోల హంగామా తెగ చేసేస్తున్నాడు. కాని, ఈ సారి తన ట్యూబ్ లైట్ మూవీ ప్రమోషన్ కోసం మరో కొత్త పబ్లిసిటీ స్టంట్ చేశాడు! అదే సైకిల్ ఎక్కి… షారుఖ్ ఇంటి ముందు నుంచీ అలా అలా సరదాగా వెళ్లటం!
మొదట్లో మంచి మిత్రులుగా వుండీ, తరువాత కావాల్సినంత గొడవపడి, ఇప్పుడు మళ్లీ సూపర్ ఫ్రెండ్స్ అయిపోయారు షారుఖ్, సల్మాన్. అయితే, తన బీయింగ్ హ్యూమన్ అనే బ్రాండ్ పేరుతో రీసెంట్ గా కొన్ని సైకిల్స్ మార్కెట్లో వదిలాడు సల్లూ. వాట్ని జనానికి పరిచయం చేసేందుకు ముంబై రోడ్లపై స్వయంగా తానే వాడుతూ అప్పుడప్పుడూ హల్ చల్ చేస్తున్నాడు కూడా. పనిలో పనిగా ఇప్పుడు రంజాన్ సందర్భంగా విడుదలవుతోన్న ట్యూబ్ లైట్ చిత్రానికి తన సైకిల్ యాత్రని వాడుకున్నాడు. బీయింగ్ హ్యూమన్ సైకిల్ వేసుకుని ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ప్రయాణించాడు. షారుఖ్ ఇల్లు రాగానే మనోడు ‘’షారుఖ్ భాయ్’’ అంటూ కేక వేశాడు! ఫాలో అవుతోన్న మీడియాని చూసి చిలిపిగా నవ్వాడు కూడా!
సల్మాన్ తన ఇంటి ముందు నుంచి వెళ్లేప్పుడు షారుఖ్ అయితే లేడు కాని… సల్మాన్ నటించిన ట్యూబ్ లైట్ సినిమాలో ఒక చిన్న పాత్రలో బాద్షా కనిపించనున్నాడు. అందుకే, ఆయన ఇంటి ముందు నుంచి వెళుతూ వెళుతూ సల్మాన్ హంగామా చేశాడు. వెనుక బాడీగార్డ్స్ ను పెట్టుకుని మరీ సైకిల్ తొక్కుతూ హల్ చల్ చేశాడు! ఎన్ని చేసినా… పాపం ఈ కాలం సినిమా స్టార్లవన్నీ… పబ్లిసిటీ పాట్లే! ఒక్క టికెట్ ఎక్కువ కట్ అవుతుందన్నా దాని కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు బాలీవుడ్ వాళ్లు!



.jpg)


