Top Stories

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్ 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేశ్  వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరియమ్మ అనే మహిళ కేసులో ఆయన 145 రోజుల జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది.  అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన సత్తెనపల్లి  కోర్టుకు వచ్చారు.  ఈ కేసులో ఆయన తప్పించుకుతిరుగుతున్నారు. . ఈ కేసు కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక వచ్చింది ఈ నేపథ్యంలోనే నందిగం సురేశ్ కోర్టులోనే  లొంగిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  
Publish Date: Feb 17, 2025 5:56PM

గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన ఇద్దరు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు సరెండర్ అయ్యారు. టీడీపీ ఆఫీసుపైదాడికేసులో మొత్తం 88 మంది నిందితులు  ఉన్నారు. వారిలో జానీ, కలామ్ అనే వ్యక్తులు సోమవారం  గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన  జరిగింది.  కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేశారు.  ఈ కేసులో ఏ71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటీవలె ఎపి పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కాకుండా   కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు.  
Publish Date: Feb 17, 2025 3:47PM

ప్రయాగ్ రాజ్ లో నారా లోకేష్.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఫొటోను ఎక్స్ లో పోస్టు చేసి రియల్లి బ్లెస్డ్ అని ట్యాగ్ ఇచ్చారు. కాగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన నారా లోకేష్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణం రాజు, మంత్రులు గొట్టిపాటి రవి, డోలా వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి,  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు ఉన్నారు. వీరంతా  పవిత్ర సంగమం వరకూ నదిలో పడవలపై ప్రయాణించారు. అనంతరం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. కాగా ఈ పర్యటనలో భాగంగా నారా లోకేష్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.   
Publish Date: Feb 17, 2025 3:01PM

వంశీ కనుసన్నలలోనే సత్యవర్థన్ కిడ్నాప్.. పోలీసుల వద్ద పక్కా ఆధారాలు?!

వంశీ కనుసన్నలలోనే టీడీపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ జరిగిందనడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా? ఆయన కిడ్నాప్ నకు సంబంధించి సీసీ ఫుటేజీల ఆధారంగా వంశీ ప్రమేయాన్ని నిర్థారించుకున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇప్పటికే పోలీసులు సత్యవర్థన్ ను రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసానికి తీసుకువెళ్లన సంఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని సేకరించారని చెబుతున్నారు. రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసం నుంచి సత్యవర్థన్ ను విశాఖ తరలించడం, అక్కడ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం వరకూ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉందని అంటున్నారు. వంశీ అనుచరులు సత్యవర్థన్ ను విశాఖ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం, సత్యవర్థన్ కారు దిగి కోర్టులోకి వెళ్లి.. తిరిగి రావడం, అతడు వచ్చే వరకూ కోర్టు ఆవరణలోనే వంశీ అనుచరులు వేచి ఉండటానికి సంబంధించి సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీ ప్రమేయానికి సంబంధించిన లింకుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  వల్లభనేని వంశీని అరెస్టు చేసినప్పటికీ అతడి ఫోన్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అటు రాయదుర్గంలోని వంశీ నివాసంలోనూ, ఇటు వంశీ వద్దా ఆ ఫోన్ లేదు. రాయదుర్గంలోని వంశీ నివాసం నుంచి అతడిని అదుపులోనికి తీసుకోవడానికి ముందు వంశీ ఫోన్ లో చాలా సేపు మాట్లాడారు. ఆ తరువాత ఆ ఫోన్ మాయం అయ్యింది. దీంతో ఈ కేసులో అత్యంత కీలకమైన రంగా, కొట్లు, రాము అనే వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. మరీ ముఖ్యంగా రంగా, కొట్లు, రాము అనే వ్యక్తులను దొరకబుచ్చుకంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వీళ్లందరి ఫోన్లూ స్విచ్ఛఫ్ అయ్యి ఉండటంతో.. పోలీసులు వారి బంధువులు, స్నేహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు.  ఇలా ఉండగా సత్యవర్థన్ తన కిడ్నాప్ నకు సంబంధించి ప్రతి  విషయాన్నీ పూసగుచ్చినట్లు పోలీసులు వివరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. అన్ని విషయాలనూ శాస్త్రీయంగా విశ్లేషించి, పక్కా ఆధారాలతోనే వంశీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని చెబుతున్నారు.  
Publish Date: Feb 17, 2025 2:25PM

టీమ్ జేఎన్‌జేకే కాంగ్రెస్  సంపూర్ణ మ‌ద్ద‌తు 

జెఎన్జె హౌసింగ్ సొసైటీకి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాగ్రెస్ పార్టీ టీమ్ జేఎన్‌జేకు సంపూర్ణ‌ మ‌ద్ద‌తునిస్తోంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు బి.మ‌హేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు.  గ‌తంలో బీఆర్ఎస్‌కు చెందిన వ్య‌క్తులు జ‌ర్న‌లిస్టుల‌ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని, దాన్ని తిప్పికొట్టేందుకు పోరాడిన టీమ్‌జేఎన్‌జేకు... నాడు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి గారు పూర్తి మ‌ద్ద‌తునిచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌జేఎన్‌జేకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నార‌న్నారు.  ఈసారి జ‌రగ‌నున్న సొసైటీ ఎన్నిక‌ల్లో టీమ్‌జేఎన్‌జే అభ్య‌ర్థుల‌ను అఖండ మెజార్టీతో గెలిపించాల‌ని పాత్రికేయ మిత్రుల‌కు ఆయ‌న‌ విజ్ఞ‌ప్తి చేశారు
Publish Date: Feb 17, 2025 2:18PM