త‌గునా ఇది మీకు రోజ‌మ్మా!

తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి ఏడాది కాలం నుంచే ఎంతో సిద్ధ‌ప‌డి వెళుతూంటారు జ‌నం. తిరుమ‌ల ర‌ద్దీకి, కాలానికి సంబంధం లేదు. ఎప్పుడూ ర‌ద్దీగానే ఉంటుంది. గంట‌ల‌త‌ర‌బ‌డీ ద‌ర్శ‌నానికి భ‌క్త‌కోటి వేచి ఉం టారు. దేవుని దృష్టిలో అంద‌రూ స‌మానులే. కానీ అధికార పార్టీవారికి అలాంటివేమీ ప‌ట్టింపులేదు. ఏపీలో వైసీపీ మంత్రులు, ఎమెల్యేలు ప్రొటోకాల్ పాటించ‌డం స‌హ‌జం. కానీ ప‌ర్యాట‌కశాఖా మంత్రి ఆర్‌.కె. రోజా మాత్రం త‌న‌కు, త‌న  అనుచురుల‌కీ పెద్ద‌గా ప్రోటోకాల్‌తో ప‌నిలేద‌నే భావించారు. ఇదే భ‌క్త‌జ‌న కోటికి ఆగ్ర‌హ‌మూ త‌ప్పించెను.

గంట‌ల‌త‌ర‌బ‌డి వేచి ఉన్న భ‌క్తుల‌ను కాకుండా త‌న‌కు, త‌నతో వ‌చ్చిన 30 మంది అనుచ‌రుల‌కు మంత్రి వారందిరికీ ద‌ర్శ‌నం వెంట‌నే ఇప్పించాల‌ని భీష్మించారు. దీనికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున పాటించాల్సిన క‌నీస ప్రోటోకాల్ ప‌ద్ధ‌తిని కూడా ఉల్లంఘించ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌టికే అధికారులు, అక్కడి  ఇత‌ర ప‌ని వారూ ఆమె రాక‌తో భ‌క్తుల ఇబ్బందుల గురించి వివ‌రించారు. కానీ తాను ప‌ర్యాట‌కశాఖ మంత్రిని క‌నుక త‌న‌కు నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వామి ద‌ర్శ‌నం క‌ల్పించాల్సిన బాద్య‌త అక్క‌డున్న అధి కారులదే అన్నంత‌గా భీష్మించారు ఆర్‌.కె.రోజా. వాస్త‌వానికి ఆగ‌ష్టు 21 వ‌ర‌కూ టిటిడి బ్రేక్ ద‌ర్శ‌నాలు నిలిపి వేసింది. 

కానీ అధికారంలో ఉన్న‌వారికి అందునా ప‌ర్యాట‌క‌శాఖ మంత్రికి టీటీడీ నియ‌మ‌నిబంధ‌న‌లు తెలియ‌క పోవు. అయినా రోజా త‌న అనుచ‌రుల‌తో బ్రేక్ ద‌ర్శ‌నం కోసం డిమాండ్ చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ  స‌మం జ‌సం అని భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు. వేలాదిమంది భ‌క్తుల‌ను కాద‌ని త‌న 30మంది అనుచ‌రుల‌కు ద‌ర్శ నం క‌ల్పించ‌డానికి ప‌ట్టుబ‌ట్టడం ఆమె అధికార బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు నిద‌ర్శ‌న‌మే అవుతుంది. ఇది ఊహిం చ‌ని సంఘ‌ట‌నే. ఇలాంటివి ఇక ముందు జ‌ర‌గ‌కుండా ఉండాల‌నే అధికారులు ప్రార్ధ‌న‌లు చేయాలి. క‌నీసం ప్రోటోకాల్ లేకుండా మంత్రిగా త‌న స‌త్తాను అనుచ‌ర‌గ‌ణం ముందు ప్ర‌ద‌ర్శించ‌డంలో అర్ధం లేదు. అధికారుల ని వత్తిడి చేసి మ‌రో ప‌దిమందికి ప్రోటోకాల్ దర్శ‌నం  కల్పించారు. దర్శనాలు పూర్త య్యకనే బయటకి వచ్చారు.