శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదంః మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా

శ్రీ స‌త్య‌సాయి జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తాడిమర్రి మండ‌లం గుడ్డంప‌ల్లి గ్రామానికి చెందిన  వ్య‌వ సాయ కూలీలు ఆటోలో వెళుతూంటారు. కానీ గురువారం వారు వెళుతోన్న ఆటో  చిల్ల‌కొండ‌య్య‌ప‌ల్లి  స‌మీ పంలో  హైటెన్ష‌న్ వైర్లు త‌గిలి ఆటోలోవున్న అయిదుగురు మ‌ర‌ణించారు. మరో ముగ్గురి పరిస్థితి  విష మంగా ఉంది. వారిని వెంటనే  అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోపై ఉన్న ఇనుప మంచా నికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ  ప్ర‌మాదం లో డ్రైవ‌ర్‌తో పాటు ఎనిమిది మంది  గాయ‌ప‌డ్డారు. కాగా ఈ ప్ర‌మాదంలో  మృతులంతా గుడ్డంప‌ల్లికి చెందిన వారుగా గుర్తించారు.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆటో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామ న్నారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలు అధికారులు తెలియజేశారు 

ఈ సంఘ‌ట‌న ప‌ట్ల టిడిపి  అధినేత చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కూలీప‌నుల‌కు వెళుతున్న‌వారు  ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌చివేసింద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంఘ‌ట‌న‌కు బాధ్యు లపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని టీడీపీ అధినేత  ప్ర‌భుత్వా న్ని డిమాండ్ చేశారు.