Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ కేసు నిలబడుతుందా?
posted on: Jun 5, 2015 7:53AM

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయి, అభిమన్యుడి పరిస్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి చర్లపల్లి కారాగారంలో వున్నారు. కొంతమంది ఈ కేసు విషయంలో ఏదేదో జరిగిపోతుందని భావిస్తున్నప్పటికీ, న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడేంత బలంగా లేదని భావిస్తున్నారు. ఇది తెలంగాణ తెలుగుదేశం వర్గాలకు ఊరట ఇస్తోంది. లంచం ఇవ్వజూపడం నేరం అయినప్పుడు అలా లంచం ఇవ్వడానికి ప్రయత్నించేలా ప్రేరేపించడం కూడా నేరమే అవుతుందని, ఈ కేసు న్యాయస్థానాల ముందుకు వస్తే పథకం ప్రకారం లంచం అడిగిన స్టీఫెన్ మీద కేసు ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న ఎదురయ్యే అవకాశం వుందని అంటున్నారు.
అలాగే, అవినీతి అక్రమాలను బట్టబయలు చేసే ప్రయత్నమంటూ ఒక వ్యక్తిని ట్రాప్ చేసి ఆ వ్యవహారం మొత్తాన్నీ రహస్య కెమెరాలతో చిత్రీకరించడం (స్టింగ్ ఆపరేషన్) చట్ట సమ్మతమైన విధానం కాదగనం గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే విధానంలో ఇరుక్కుపోయారు. మరి ఈ కేసు కోర్టు ముందు ఎంతవరకు నిలబడుతుందనేది సందేహమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్నప్పుడు కంపించిన తెలంగాణ తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు న్యాయ నిపుణుల క్లారిఫికేషన్‌తో స్థిమితపడ్డాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ కేసును కోర్టు ముందుకు తీసుకువెళ్ళేలోపు పకడ్బందీ ఆధారాలతో సిద్దమవడానికి కసరత్తు చేస్తోంది.






