Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు జవాబు
posted on: Jun 4, 2014 11:39AM
.jpg)
కేసీఆర్ తన మంత్రివర్గంలో ఆయన కొడుకు కె.తారక రామారావుకు,మేనల్లుడు హరీష్ రావుకు ముఖ్యమయిన శాఖలు కట్టబెట్టడంతో, అదొక ‘ఫ్యామిలీ ప్యాక్’ లా ఉందని తెదేపా నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.
దానిపై కేటీఆర్ ఈరోజు స్పందిస్తూ, “మేమేమీ వెనుక గేటు గుండా లోనకి దూరి అధికారం సంపాదించుకోలేదు. అందరం ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాము. ఎన్నికలలో పోటీ చేసి ప్రజలు మమ్మల్ని నచ్చి ఎన్నుకొన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా మేము అధికారం చేపడుతున్నపుడు మా ప్రత్యర్ధ పార్టీ నేతలు ఎందుకు బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు. రేపు వారి పార్టీలో కుటుంబ సభ్యులెవరికీ మంత్రి పదవులు ఈయరని ప్రకటించగాలరా? అయినా మేము మా ప్రత్యర్ధులకు మాటలతో కాక మా పనితీరుతోనే వారికి సరయిన జవాబిచ్చి చూపిస్తాము. హైదరాబాద్ నగరం గురించి ఉన్న అపోహలన్నీ దూరం చేసి, దానిని అద్భుతంగా తీర్చి దిద్దుతాము,” అని అన్నారు.
నిజమే కదా! హిందూపురం నుండి ఎన్నికయిన నందమూరి బాలకృష్ణ కూడా మంత్రి పదవి కోరుకొంటున్నారు. అటువంటపుడు కేసీఆర్ మంత్రివర్గం ‘ఫ్యామిలీ ప్యాక్’ అని రేవంత్ రెడ్డి వర్ణిస్తే, బాలకృష్ణకు మంత్రిపదవి ఇస్తే అప్పుడు చంద్రబాబు మంత్రివర్గానికి కూడా అదే ‘ఫ్యామిలీ ప్యాక్’ వర్తిస్తుంది కదా! కాకపోతే కేసీఆర్ మంత్రివర్గంలో ఒకే కుటుంబం నుండి ముగ్గురు మంత్రులుగా ఉంటే, చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరు ఉంటారు. అంతే తేడా. రాజకీయాలలో కుటుంబపాలన నేడు సర్వసాధారణమయిన విషయమయిపోయింది. అందువల్ల అద్దాలమేడలో కూర్చొని ఇతరులపై రాళ్ళు వేయడం వారికే ప్రమాదం.


.jpg)
.jpg)


