Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రిజర్వేషన్ క్యాన్సిలేషన్.. బోర్డింగ్ స్టేషన్ మార్పు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
posted on: Mar 25, 2026 10:09AM

టికెట్ క్యాన్సిలేషన్, బోర్డింగ్ పాయింట్ నిబంధనలకు ఇండియన్ రైల్వే కీలక సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే ఇంచుమించు పూర్తి సొమ్ము రిఫండ్ వస్తుంది. కేవలం క్యాన్సిలేషన్ చార్జీలను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 75 శాతం, 24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే 50 శాతం రిఫండ్ ఇవ్వనుంది.
ఈ మేరకు టికెట్ల రద్దు , రిఫండ్ పాలసీ, బోర్డింగ్ పాయింట్ మార్పునకు సంబంధించి పాత నిబం ధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే దళారుల ఆగడాలకు చెక్ పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా రైల్వేశాఖ పేర్కొంది. మారిన నిబంధనలు వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా అములులోకి వస్తాయి.
ఈ కొత్త నిబంధనలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యవస్థలో ట్రాన్సపరెన్సీ తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దళారులు ముందుగానే టికెట్లను బ్లాక్ చేసి, ప్రయాణానికి కొద్దిసేపటి ముందు వాటిని రద్దు చేస్తూ రిఫండ్ పొందుతున్నారని, దీనివల్ల సామాన్య ప్రయాణికులకు బెర్తులు దొరకడం లేదన్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఖాళీ అయ్యే సీట్లు తక్షణమే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అర్హులైన ప్రయాణికులకు దక్కే అవకాశం ఉంటుందన్నారు.
అదలా ఉంటే.. బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చింది. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకూ కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఈ మార్పులకు అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యల వల్ల నిర్ణీత స్టేషన్‌కు చేరుకోలేకపోయే వారికి ఈ కొత్త రూల్ ఎంతగానో ఉపయోగపడనుంది.



.webp)


