Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ తో విడాకులు.. రేణూదేశాయ్ సంచలన వ్యాఖ్యలు.!!
posted on: Jul 7, 2018 5:33PM

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు రేణూదేశాయ్.. హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మనకి సుపరిచితురాలు.. పవన్, రేణూదేశాయ్ విడాకులు తీసుకున్న తరువాత.. పవన్ మరో పెళ్లి చేసుకొని ఆయన జీవితం ఆయన బ్రతుకున్నారు.. రేణూదేశాయ్ పిల్లల్ని చూసుకుంటూ ఇన్నాళ్లు ఒంటరిగా బ్రతికారు.. కానీ ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు.. ఇది జీర్ణించుకోలేని కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెని సోషల్ మీడియాలో బెదిరించడం మొదలుపెట్టారు.. దాంతో భయపడిన రేణూదేశాయ్ ఆమెకి కాబోయే భర్త వివరాలు వెల్లడించలేదు.. నిశ్చితార్థం అయిన విషయం మాత్రం వెల్లడించారు.. దీంతో ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారు.. ఆమె విడాకుల తరువాత ఎవరి లైఫ్ వారికి ఉంటుంది అని ఫ్యాన్స్ కి అర్ధమయేలా చెప్పే ప్రయత్నం చేసారు..
అయినా ఫ్యాన్స్ వినలేదు.. పవన్ కూడా రేణూదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్తూ పాజిటివ్ గా పోస్ట్ చేసారు.. వారు అభిమానించే పవన్ పోస్ట్ కూడా కొందరికి పట్టలేదు.. ఆమెని అలానే బెదిరిస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.. ఆమె చాలావరకు సహనంగా ఉంటూ వచ్చారు.. ఇక లాభం లేదని ఒక ఇంటర్వ్యూ ద్వారా తన మనసులో ఉన్న బాధని, కోపాన్ని బయటపెడుతూ ఫ్యాన్స్ కి అదిరిపోయే సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్నాను.. కానీ ఇక భరించలేను అని చెప్పిన రేణూదేశాయ్.. అసలు విడాకులు కావాలన్న కోరిక ముందుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచే వచ్చింది, నేనెప్పుడూ డివోర్స్ అడగలేదు అని స్పష్టం చేసారు.. పవన్ కళ్యాణ్ గారి ఫిమేల్ ఫ్యాన్స్‌ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా..
మీరే ఆయన భార్యగా వుండి.. 11 సంవత్సరాలు కాపురం చేసి.. మీకు తెలీకుండా అతడు మరొకావిడతో బిడ్డను కంటే మీకు ఎలా ఉంటుంది..? అని ప్రశ్నించారు.. పిల్లల కోసం పెళ్లి నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. అకీరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలవడం.. అకీరాతో పాటు పవన్ కళ్యాణ్‌కి కూడా ఇష్టం లేదు.. అందుకే వద్దన్నా అని తెలిపారు.. పవన్ ఫ్యాన్స్ విమర్శలు ఆపకపోవడం వల్లే ఇలా ఇంటర్వ్యూ ద్వారా నా గురించి చెప్పుకోవాలనిపించింది అని ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే 'అమ్మాయిలూ గట్టిగా వుండండి.. ప్రేమ ముఖ్యమే..
కానీ ప్రేమే జీవితం కాదు.. ఎవ్వరూ ఆ మాయలో పడొద్దు' అని అన్నారు.. ఇన్ని రోజులు సహనంగా ఉన్న రేణూదేశాయ్ ఇలా మాట్లాడటానికి ఖచ్చితంగా పవన్ ఫ్యాన్సే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.. విడాకుల తరువాత పవన్ కి ఒక జీవితం ఉన్నట్టే, రేణూదేశాయ్ కి కూడా ఒక జీవితం ఉంటుందని అర్ధం చేసుకోకుండా ఆమె మీద విమర్శలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.. అలానే పవన్ కూడా రేణుదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, రేణుదేశాయ్ ని ఇబ్బంది పెట్టొద్దని ఒక్కమాట చెప్తే ఫ్యాన్స్ ఆగేవారు కాదా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.






