జగన్ ఢిల్లీ పర్యటన.. అందుకోసమేనా?

ఏపీ సీఎం హఠాత్తుగా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. నిర్దుష్టంగా ఇందుకు కారణమేమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన హస్తిన పర్యటన కోసమే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.    శుక్రవారం, శనివారం నాటి పర్యటనలను జగన్ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

అయితే ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఇంకా బయలుదేరలేదని చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రుక్రవారం (జనవరి 27)  ఉమ్మడి చిత్తూరు జిల్లా  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది.  అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు వైసీపీ నేత ఇంట్లో జరిగే వివాహ వేడుకకు సైతం సీఎం   హాజరవ్వాల్సి ఉంది. అలాగే శనివారం జగన్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. విశాఖలో ఆయన చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాల్సి ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి లోక్ సభ సభ్యుల నివాసాల్లో జరిగే వివాహ వేడకలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలను ఇంత అర్థాంతరంగా రద్దు అయ్యాయి.  హస్తిన పర్యటన కోసమే ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయని అంటున్నారు. కు ఎందుకు వెళ్తున్నారంటూ సదరు వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. 

అయితే సీఎం ఢిల్లీ పర్యటనపై సీఎంవో కార్యాలయం పెదవి విప్పడం లేదు. దీంతో జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ఎందుకు అన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.   కడప ఎంపీ ఆవినాశ్ రెడ్డి.. శనివారం (జనవరి 28)  సీబీఐ ఎదుట... విచారణకు హాజరుకావాల్సి ఉంది.  అలాగే జనవరి 31వ తేదీన రాజధాని కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో  జగన్.. తన ఢిల్లీ పర్యట ప్రాధాన్యత సంతరించుకుంది. 

 వివేకా హత్య కేసులో   అవినాశ్ రెడ్డికి ఇటీవల సీబీఐ నోటీసులు అందజేసింది. అయితే తాను.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని.. సీబీఐ అధికారులకు  అవినాశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన అజ్ణాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న సమాచారంతో సీబీఐ అప్రమత్తమైంది. దీంతో అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసైనా విచారించాలని సీబీఐ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.   

ఇప్పటికే  వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే అంశంపై సీబీఐకి ఓ క్లారిటీ వచ్చిందని.. ఈ నేపథ్యంలో వైయస్ ఫ్యామిలీలోని పలువురు కీలక వ్యక్తులను విచారించి.... అనంతరం సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులతో జోరుగా సాగుతోంది. 

  ఇటీవల  అవినాశ్ రెడ్డి తండ్రి   భాసర్కరెడ్డి కోసం..  సీబీఐ ఆరా తీయడం కూడా అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డిలను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ హడావుడిగా హస్తిన పర్యటన పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవంగా ఆయన శుక్రవారం (జనవరి 27)నే హస్తినకు బయలుదేరుతారని భావించారు. అయితే కారణాలేమిటైనా పర్యటనలు రద్దు చేసుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఏ క్షణంలోనైనా హస్తిన నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని ఆయన ఎదురు చూస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.