మణిపూర్ లో కంపించిన భూమి

మయన్మార్ లో శుక్రవారం( మార్చి 28) సంభవించిన భారీ భూకంపం అనంతరం అదే రోజు మణిపూర్ లో భూమి కంపించింది. ఆ తరువాత శనివారం (మార్చి 29) మధ్యాహ్నం కూడా మరోసారి భూమి కంపించింది.  ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా శుక్రవారం మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భూకంపం కారణంగా వేయి మందికిపైగా మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక మయన్మార్ లోనే మృతుల సంఖ్య 1002లో అక్కడి అధికారులు ధృవీకరించారు. ఇంకా వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పేరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. కాగా బ్యాంకాక్ లో భూకంప సమయంలో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భూకంప సమయంలో బ్యాంకాక్ లోని బీఎన్ హెచ్, కింగ్ చులాలాంగ్ కార్న్ మెమోరియల్ ఆస్పత్రుల నుంచి రోగులను సమీపంలోని పార్క్ కు తరలించారు. ఆ పార్కులో, బహిరంగ ప్రదేశంలోనే ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  ఆ మహిళ స్ట్రేచ్చర్ పై పడుకుని ఉండగా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియలో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  
మణిపూర్ లో కంపించిన భూమి Publish Date: Mar 29, 2025 4:42PM

కొలికిపూడి మాకొద్దంటూ  మంగళగిరిలో నిరసన

మొదటినుంచి వివాదాలకు కేంద్రబిందువైన కృష్ణా జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికి పూడి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.  శనివారం (మార్చి29) మంగళగిరిటిడిపి కార్యాలయానికి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు తరలివచ్చాయి. అనేక పర్యాయాలు అధిష్టానం హెచ్చరిస్తున్నప్పటికీ కొలికి పూడి తన వైఖరి మార్చుకోలేదు. స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. తిరువూరు నియోజకవర్గ టిడిపి నేత అలవాల రమేష్ రెడ్డిపై చర్య తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇవ్వడం తాజాగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మంగళగిరి టిడిపి కార్యాలయానికి టిడిపి కార్యకర్తలు చేరుకున్నారు. కొలికిపూడి మా కొద్దంటూ నినాదాలు చేశారు. 
కొలికిపూడి మాకొద్దంటూ  మంగళగిరిలో నిరసన Publish Date: Mar 29, 2025 4:24PM

గన్నవరం పోలీసుల కస్టడీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు. జైలు నుంచి ఆయనను కంకిపాడు పోలీసు స్టుషన్ కు తరలించారు. అంతకు ముందు జైలు నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులిచ్చిన నివేదిక ఆధారంగా వంశీ ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడ నుంచి కంకిపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ వంశీని విచారిస్తున్నారు.  ఇంతకీ గన్నవరం పోలీసులు వంశీ కస్టడీని ఎందుకు కోరారంటే.. ఉమ్మడి జిల్లా అత్కూరు మండలంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి అతని పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని కొందరు ఆక్రమించుకుని, అప్పటికి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ సహకారంతో వారి పేర కుట్రపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై బాధితుడు శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఈ కుట్రకు సూత్రధారి వంశీయేనని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వంశీని కోర్టు అనుమతి మేరకు ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు.  
 గన్నవరం పోలీసుల కస్టడీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే Publish Date: Mar 29, 2025 2:58PM

ఆసిఫాబాద్ లో అరుదైన పెళ్లి... ఇద్దరు భార్యల ముద్దుల భర్త

తెలంగాణ  కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓ యువకుడు పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించాడు. ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు అనుకుంటే పొరబడినట్టే. ఇద్దర్ని ప్రేమించానని ఆ యువకుడు ప్రేమించిన యువతులకు చెప్పినప్పటికీ ఆ యువతులకు కోపం రాలేదు. మేమిద్దరం నిన్ను పెళ్లి చేసుకుంటామన్నారు.  లింగాపూర్  మండలం గుమ్మూర్ కుచెందిన సూర్యదేవ్   ఇద్దరు యువతులను ఒకే సారి పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు. శుభలేఖలు కూడా పంచాడు. పెళ్లి వేడుకను చూడటానికి భారీ సంఖ్యలో  జనం వచ్చినప్పటికీ ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ అన్ని మర్యాదలు చేశాడు.  గిరిజన సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది. ఇద్దరు యువతుల మెడలో తాళికట్టడంతో వారు వైవాహిక జీవితంలో ఎంటరయ్యారు. సూర్యదేవ్ కు పెద్దగా ఆస్తి పాస్తులు లేవు. ఒక సాధారణ రైతు మాత్రమే. వేర్వేరు గ్రామాలకు చెందిన యువతుల తల్లిదండ్రులను  కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్న సూర్యదేవ్  ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా మారిపోయాడు. 
ఆసిఫాబాద్ లో అరుదైన పెళ్లి... ఇద్దరు భార్యల ముద్దుల భర్త Publish Date: Mar 29, 2025 2:30PM

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు నో జాతీయ హోదా.. స్పష్టం చేసిన కేంద్రం

తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేల్చేసింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చేసిన విజ్ణప్తిని నిర్ద్వంద్వంగా తిరిస్కరించింది. కృష్ణా జలాల వివాదం సుప్రీం కోర్టులో ఉన్న నేపథ్యంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు లేవని క్లియర్ కట్ గా చెప్పేసింది.   ఈ విషయమై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్ సభలో లేవనెత్తగా,  ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ  విషయం కృష్ణా ట్రైబ్యునల్  పరిధిలో ఉండటం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, పర్యావరణ నివేదికలను పరిగణనలోనికి తీసుకోజాలమని జలశక్తి శాఖ తేల్చేసింది.     ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెనక్కు పంపినట్లు పేర్కొంది. ఈ విషయాలను లోక్ సభ వేదికగా కేంద్రం స్పష్టంగా ప్రకటించింది.  ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి 2022 సెప్టెంబర్ లో ప్రతిపాదన వచ్చిందని కేంద్రం తెలిపింది. అయితే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ గత ఏడాది డిసెంబర్ లో వెనక్కు పంపినట్లు వివరించింది.   
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు నో జాతీయ హోదా.. స్పష్టం చేసిన కేంద్రం Publish Date: Mar 29, 2025 2:16PM