మహానగరంలో విలయంపై 'రంగం'లో మహంకాళి ముందే హెచ్చరించింది.. 

వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే. ఈ వర్షాలతో కొన్ని చోట్ల ఐతే అపార్ట్ మెంట్లలోని మొదటి రెండో ఫ్లోర్ వరకు నీరు రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక పక్క నాళాలు కబ్జా.. మరో పక్క చెరువులకు గండ్లు పడడంతో కాలనీలు.. చెరువులను తలపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎపుడు చూడని స్థాయిలో వరద నీటికి అటు పశువులు. ఇటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

అయితే ఈ విపత్తు గురించి బోనాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద జరిగే భవిష్యవాణి "రంగం"లో అమ్మవారు పూనిన మహిళ స్వర్ణలత ముందే హెచ్చరించింది. "గంగ వస్తుంది రా.. అంతా కొట్టుకుపోతుంది, ఇంక మీరు ఆలోచించేది లేదు. నేను చెప్పేది లేదు. ఏడుగురు అక్కాచెల్లెళ్లం.. ఆగమేఘాల మీదున్నాం. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అందరూ జాగ్రత్తగా ఉండాలని" ఆ రంగంలో స్వర్ణలత ఛేప్పారు. అంతేకాకుండా ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని" ఆమె హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సంవత్సరం జరిగిన రంగంలో ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.