ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయట..

 

ఈ ఏడాది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాతావరణ శాఖ అధికారులు కూడా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. అయితే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అదేవిధంగా వర్షాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ అధికారులు. 2016 రుతు పవనాల ప్రభావం సాధారణం కంటే 94 శాతం అధికంగా ఉండే అవకాశముందని.. కరువు రాష్ట్రాల్లో వర్షాలు బాగానే కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి  ఎల్.ఎస్.రాథోడ్ తెలిపారు. జూన్, సెప్టెంబర్ మాసాల మధ్య వర్షపాతం సాధారణం కన్నా 104 నుంచి 110 శాతం అధికంగా ఉండవచ్చని అన్నారు.