Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ నిర్లక్ష్యం... చంద్రబాబుకు కలిసొచ్చింది..
posted on: Jan 12, 2018 2:28PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరమైంది. అందుకే తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు ఏపీకి వచ్చింది. అసలు కేసీఆర్ అంతలా పట్టించుకోని ప్రాజెక్టు ఏంటి..ఎందుకు కేసీఆర్ పట్టించుకోలేదు అని అనుకుంటున్నారా...? అదేంటంటే... “రైల్ నీర్” ప్రాజెక్టు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 50 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో “రైల్ నీర్” ప్రాజెక్ట్ ను స్థాపించేందుకు 2012లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇప్పటివరకూ దానిపై ఎలాంటి ప్రాసెస్ చేయలేదు.ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా..కనీసం భూమిని గానీ, ఇతర మౌలిక సదుపాయాలను గానీ కల్పించలేకపోయారు కేసీఆర్. దీంతో కేసీఆర్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంతో లాభం లేదని భావించిన ఐఆర్సీటీసీ ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది.
ఇక ఏపీలోని నూజివీడు పరిసర ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ను నెలకొల్పేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటూ ఒక ఎకరం భూమిని కూడా కేటాయించింది. దీంతో హైదరాబాద్ లో ఉండాల్సిన ప్రాజెక్ట్ కాస్త ఏపీకి తరలిపోయింది. పెట్టుబడి రీత్యా 50 కోట్లే అయినప్పటికీ, ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి లభించనుంది. అంటే భవిష్యత్తులో ‘రైల్ నీర్’ బాటిల్ పైన తయారీ ప్రాంతం ఏపీలోని నూజివీడు అని చూడోచ్చన్న మాట. మరి కేసీఆర్ ఈ ప్రాజెక్టు ను అంతలా ఎందుకు పట్టించుకోలేదో.. చిన్న ప్రాజెక్టే కదా అని లైట్ తీసుకున్నారేమో. మరి ఇప్పుడు 50 కోట్లే చిన్న ప్రాజెక్టే.... భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య ధోరణితోనే ఉంటే ఈరోజు 50 కోట్లే.. రేపు... 500 కోట్ల ప్రాజెక్టు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి కేసీఆర్ సాబ్.. జర జాగ్రత్త...


.jpg)



