Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిద్రపోకుండా వుండటం ఎలా? రాహుల్‌గాంధీకి సలహాలు!
posted on: Jul 11, 2014 11:58AM

బాబూ రాహుల్ గాంధీ... నువ్వు ఈమధ్య ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గుర్రుకొడుతున్నావంటగా? మొన్నీమధ్య పార్లమెంటులో అధిక ధరలు అనే పాయింట్ మీద చర్చ జరుగుతుంటే, నువ్వు ఆ చర్చని ఎంతమాత్రం పట్టించుకోకుండా హాయిగా నిద్రపోయావంటగా! నువ్వు పార్లమెంటులో నిద్రపోతున్న ఫొటోలు చూశాలే. నువ్వు నిద్రపోతున్నప్పుడు మహా అందంగా, అమాయకంగా వుంటావు సుమీ! పార్లమెంటులో నువ్వు హాయిగా నిద్రపోయినా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నిన్ను వెనకేసుకొస్తున్నారు. నువ్వు నిద్రపోవడం లేదని, కళ్ళుమూసుకుని ఆలోచిస్తున్నావని, స్పీచ్ వింటున్నావని, మెడిటేషన్ చేస్తున్నావని, తపస్సు చేస్తున్నావని... ఇలాంటి అతకని రీజన్స్ చాలా చెప్పారు, కానీ, నువ్వు నిద్రపోయిన విషయం నీకు తెలుసు... మాకు తెలుసు! అప్పా రాహులప్పా.. నువ్వు సింహం లాంటోడివి.. అది పగలు నిద్రపోతుంది. నువ్వూ పగటిపూటే నిద్రపోతావ్. నిద్ర విషయంలో మాత్రమే మీరిద్దరూ సేమ్ టు సేమ్. అయినా పార్లమెంటులో నిద్రపోవటమేంటీ? ఏబ్బే! సర్లే, నువ్వు పార్లమెంటులో నిద్రపోయావ్.. తర్వాత అడ్డంగా దొరికిపోయావ్.. ఆ విషయం ఇక వదిలేద్దాం. ముందు ముందు నిద్రపోకుండా వుండాలంటే ఏం చేయాలో చెబుతా విను. ఎక్కడైనా భార్యాభర్తలైన రెండు నల్లుల్ని సంపాదించు. వాటిని నీ సీట్లో వదిలిపెట్టు. అవి పిల్లాపాపలతో వర్ధిల్లి నీకు నిద్రపట్టకుండా చేస్తాయి. సమావేశాలకు వెళ్ళే ముందు నీ జుబ్బా జేబులో గుప్పెడు కరెంటు చీమల్ని వేసుకెళ్ళు. నీకు నిద్రనేదే పడితే అప్పుడు అడుగు! నీ రెండు కళ్ళనీ పత్తికాయల్లా తెరిచి అవి మూసుకుపోకుండా టేప్ వేయి. ఇలా చేస్తే సాధారణంగా నిద్ర రాదు. ఒకవేళ అలా కూడా నిద్రపోగలిగే టాలెంట్ నీకు వుంటే ఆ విషయం ఎవరూ కనిపెట్టలేరు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తావా? సమాధానం చెప్పవేంటి? ఓయ్ రాహుల్ గాంధీ... ఓ మై గాడ్.. మళ్ళీ నిద్రపోయాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా వేస్ట్!


.png)
.jpg)


