Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ గాంధీ అదృశ్యం... ఊహాగానాలు...
posted on: Apr 2, 2015 6:53PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గిట్టనివాళ్ళు ‘మొద్దబ్బాయి’ అని పిలిచే వ్యక్తి, ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని బోలెడన్ని ఆశలు పెట్టుకుని చివరికి విఫలమైన వ్యక్తి... ఇంకెవరూ.. రాహుల్ గాంధీ. ఈయన గారు ఈమధ్య పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీ అమ్మాయి ఎక్కడికెళ్ళాడని వాళ్ళ అమ్మని అడిగితే ఆమె ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా ప్రస్తుతం లీవులో వున్నాడని మాత్రమే చెప్పింది. ఆ తర్వాత మొన్నీమధ్య లీవ్ ఎక్స్‌టెండ్ చేశాడని వివరించింది. అయితే ఇంతకీ రాహుల్ గాంధీ ఎక్కడకి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో మాత్రం ఎవరూ చెప్పడం లేదు. దాంతో దేశంలో రాహుల్‌గాంధీ అదృశ్యం కావడం మీద అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాల్లో కొన్ని...
* రాహుల్ గాంధీ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలసి షికార్లు కొట్టడానికి వెళ్ళాడు.
* రాహుల్ గాంధీని ఆయన గర్ల్‌ఫ్రెండ్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది.. అందుకే ఆమెని వెతకడానికి వెళ్ళాడు.
* రాహుల్ గాంధీకి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడో పెళ్ళయిపోయింది. ప్రస్తుతం ఆమె ఏదో దేశంలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం అక్కడే వున్నాడు.
* రాహుల్ గాంధీ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడకి వెళ్ళాడో సోనియా గాంధీకి కూడా తెలియదు.
* రాహుల్ గాంధీ తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకి ఇటలీలో చికిత్స జరుగుతోంది.
* రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
* ప్రధానమంత్రి అవ్వాలనే కల చెదిరిపోయేసరికి రాహుల్ గాంధీకి మతిస్థిమితం తప్పింది. అందుకే ఎటో వెళ్ళిపోయాడు.
* రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి గొడవ జరిగింది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
* రాహుల్ గాంధీ పెళ్ళి చేసుకోకపోతే ఇంట్లో వుండటానికి వీల్లేదని సోనియాగాంధీ బయటకి తరిమేసింది.
* రాహుల్ గాంధీ ఇంట్లోనే వున్నాడు. అందరూ చులకనగా చూస్తూ వుండేసరికి బయటకి రావడం లేదు.



.jpg)


