Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ 'మంచం' పట్టింది!
posted on: Sep 6, 2016 6:41PM

ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మంచం పట్టింది! ఇదేదో సెటైర్ కోసం అంటోన్న కామెంట్ కాదు! నిజంగానే యూపీ కాంగ్రెస్ మంచం పట్టింది! 2012లో మోదీని గుజరాత్ సీఎంగా తిరిగి ఎన్నిక అయ్యేలా చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ల్ ప్రశాంత్ కిషోర్. అతని ప్లానింగ్ తోనే మోదీ 2014లో పీఎం కూడా అయ్యారు. తరువాత బీజేపితో చెడటంతో ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో నితీష్ వైపు చేరాడు. అతనికి ప్లానింగ్ చేయటంతో బీహార్లో బీజేపి ఓటమి పాలై నితీష్ గెలిచాడు! ఇప్పుడు అదే కింగ్ మేకర్ ప్రశాంత్ కిషోర్ యూపీలో కాంగ్రెస్ కోసం పని చేస్తున్నాడు...
మోదీని, నితీష్ ని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రస్ ని, షీలా దీక్షిత్ ని కూడా గెలిపిస్తాడని ధీమాగా వున్నారు హస్తం పార్టీ వారు! ఆ సంగతి ఇప్పుడే తెలియదుగాని రాహుల్ గాంధీ మాత్రం అప్పుడే రంగంలోకి దిగిపోయాడు. ఎలాగైనా తాను నేరుగా ప్రధాని మాత్రమే కావాలనుకున్న ఆయన షీలా దీక్షిత్ సీఎం అవుతారని చెబుతూ 27ఏళ్ల తరువాత తమకు అధికారం ఇవ్వాలంటూ పాదయాత్ర మొదలుపెట్టాడు. మంగళకరంగా మంగళవారం నాడు యువరాజా వారు ప్రారంభించిన ఈ సుదీర్ఘ పాదయాత్ర తొలి రోజే సంచలనం అయింది! అందుకు కారణం... మంచాలే!
ప్రశాంత్ కిషోర్ తనదైన స్టైల్లో రాహుల్ గాంధీ చేత రెండు వేల పైచిలుకు కిలో మీటర్ల పాద యాత్ర చేయిస్తున్నాడు. అందులో భాగంగా ఊత్తర్ ప్రదేశ్ రైతులతో ఖాట్ సభలు నిర్వహింపజేస్తున్నాడు. ఖాట్ సభలంటే నులక మంచాలపై కూర్చుని మాట్లాడుకోవటం అన్నమాట! ఊళ్లలో మంచాలపై కూర్చుని రాజకీయాలు చర్చిస్తుంటారు కాబట్టి... ప్రశాంత్ కిషోర్ న్యాచురల్ గా ఇలా ప్లాన్ చేశాడు!
మోదీ చేత ఛాయ్ పే చర్చా అంటూ టీ తాగిస్తూ మీటింగ్ లు పెట్టిన ప్రశాంత్ రాహుల్ కి ఖాట్ సభలు ఏర్పాటు చేయటం సంతోషించ దగిన విషయమే కాని... మొదటి రోజు రాహుల్ సభ విన్న రైతులు వెళుతు వెళుతూ మంచాలు కూడా పట్టుకుపోయారు! దాదాపు రెండు వేల మంచాలు వుంటే చాలా వరకూ రైతులు తీసుకెళ్లిపోయారు! ఇలా అయితే , రాహుల్ ఖాట్ సభలన్నీ ముగిసేలోగా కాంగ్రెస్ వేలాది, లక్షలాది మంచాలు కొనాల్సి వస్తుంది. ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి! కాకపోతే, ఎన్ని మంచాలు కొనుక్కొచ్చైనా గత పాతికేళ్లుగా మంచాన పట్టిన యూపీ కాంగ్రెస్ ని లేపి కూర్చోపెట్టాలన్నది ప్రశాంత్ కిషోర్ , రాహుల్ గాంధీల గట్టి ప్రయత్నం!






