Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డల్లయిపోయిన రఘువీరారెడ్డి
posted on: May 12, 2014 3:43PM
.jpg)
ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్‌ని విభజించిందో అప్పుడే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆ డెడ్ బాడీని రఘువీరారెడ్డిని చేతిలో పెట్టి ఈ డెడ్‌బాడీని బతికించమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. పాపం రఘువీరారెడ్డి చిరంజీవి లాంటి పెద్దమనిషితో కలసి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో క్లియర్‌గా చెప్పేశాయి. అయితే ఫలితాలు ఇలా వచ్చినప్పటికీ రఘువీరారెడ్డికి జ్ఞానోదయం కలిగినట్టుగా కనిపించడం లేదు. మునిసిపల్ ఫలితాలలో సీమాంధ్ర కాంగ్రెస్ మటాషైపోయిందని స్పష్టంగా తెలియగానే రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతైపోవడం, దాంతోపాటు తాను ప్రాతినిధ్యం వహించిన మడకశిర నియోజకవర్గంలోని మడకశిర మునిసిపల్ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన చాలా డల్లుగా మారిపోయారు. ఈ అపజయాన్ని హుందాగా స్వీకరిస్తున్నామని ఆయన మరింత హుందాగా వాయిస్ మార్చి చెప్పారు. రఘువీరా అక్కడితో ఆగితే బాగుండేది. ఇప్పుడు మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు రేపు పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాల్లో రావని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. పాపం ఈ దశలో అలా చెప్పక ఇంకెలా చెబుతారులే..


.jpg)
.jpg)


