Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్ట్
posted on: Mar 12, 2026 12:58PM

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడు రోజులుగా ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు హాజరై విచారణకు సహకరిస్తున్న సునీల్ నాయక్, ఎనిమిదో రోజు మాత్రం విచారణకు హాజరు కాలేదు. సాధారణంగా నిర్ణయించిన సమయానికి స్టేషన్‌కు చేరుకునే సునీల్ నాయక్, ఈరోజు గురు వారం ఉదయం 12:00 గంటలు దాటినా సీసీఎస్ స్టేషన్‌కు రాకపోవడంతో కేసు పరిణామాలపై పలు సందేహాలు వ్యక్తమవుతు న్నాయి.
విచారణకు హాజరుకాకపోవడానికి కారణం ఏమిటనే దానిపై అధికారులు, న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, సునీల్ నాయక్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అర్హత పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో విచారణకు గైర్హాజరు కావడం కేసులో మరింత ఆసక్తి రేపుతోంది. హైకోర్టు విచారణ అనంతరం తదుపరి పరిణామాలు ఏవిధంగా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కస్టోడియల్ టార్చర్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, సునీల్ నాయక్ విచారణకు రాకపోవడం మరింత సంచలనానికి దారి తీసింది. ఇక హైకోర్టు విచారణలో వచ్చే నిర్ణయం ఈ కేసు దిశను నిర్ణయించే అవకాశం ఉంది.



.webp)


