Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడరా?... హవ్వ!
posted on: Jul 23, 2014 9:27AM

టెన్నిస్ తార సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతోపాటు ఆమెకు కోటి రూపాయల నజరానాను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం పట్ల భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం మీద తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్నల్లో కొన్ని ఇలా వున్నాయి..
1. సానియా మిర్జాకి అసలు తెలుగు భాష వచ్చా? తెలుగురాని వ్యక్తి తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?
2. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కి 1956 నిబంధన విధించారు కదా.. మరి సానియా మిర్జా కుటుంబం 1956 ముందు నుంచే తెలంగాణలో వుందా? ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుందా?
3. సానియా మిర్జా తండ్రి మహారాష్ట్రలో జన్మించాడు. ఆమె భర్త పాకిస్థాన్‌కి చెందిన వాడు. సానియా మిర్జా దుబాయ్‌లో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంది. అలాంటి సానియా మిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?
4. సానియా మిర్జా తెలంగాణకు గర్వకారణమా? ఏరకంగా గర్వకారణం? జాతీయ పతాకానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకుని కూర్చోవడం తెలంగాణకు గర్వకారణమా? ఆమె తెలంగాణ కోసం ఏం చేసిందని గర్వపడుతున్నారు? సానియా మిర్జా కనీసం తెలంగాణ ఉద్యమానికి మద్దతు అయినా పలికిందా?
5. టెన్నిస్ క్రీడ ద్వారా, టెన్నిస్ అకాడమీ స్థాపించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన సానియా మిర్జాకు కోటి రూపాయలు ఇచ్చారు. మరి చదువుకుంటామని అంటున్న పేదవారికి మాత్రం ఫీజులు ఇవ్వనంటున్నారు. ఇదేం న్యాయం?
6. ఎంతోమంది బంగారు తల్లులు వున్న తెలంగాణ గడ్డమీద తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి అచ్చ తెలంగాణ ఆడపడుచు ఎవరూ కేసీఆర్ ప్రభుత్వానికి దొరకలేదా?



.jpg)


