పీవీ సింధుకు కాంస్యం.. చరిత్ర స్పష్టించిన తెలుగు తేజం

తెలుగు తేజం పీవీ సింధు మరోసారి మెరిసింది. అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. టోక్సో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్  విభాగంలో కాంస్య పతకం సాధించింది. సెమీస్ లో ఓడిపోయిన సింధు.. ఆదివారం జరిగిన కాంస్యం పతకం పోరులో మాత్రం అద్భుతంగా ఆడి విజయం సాధించింది. భారతదేశానికి మరో మెడల్ అందించింది. 

కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ బింగ్ జియావిపై వరుస సెట్లలో విజయం సాధించింది పీవీ సింధు. మ్యాచ్ ఆరంభం నుంచి అదరగొట్టిన తెలుగు తేజం తొలి సెట్ ను 21-13 తేడాతో ఈజీగా గెలుచుకుంది. రెండో సెట్ లోనూ అదే దూకుడు కొనసాగించి మ్యాచ్ ను కైవసం చేసుకుంది. భారత్ కు కాంస్య పతకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి సంచలనం స్పష్టించిన పీవీ సింధు.. వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ మెడల్ సాధించి రికార్డు స్పష్టించింది.