ఆన్లైన్ చదువులకోసం స్మార్ట్ ఫోన్ ఇస్తే కొంప కొల్లేరు చేశారు.. 

ఇంటర్నెట్ ప్రంచంలో నేటి పిల్లలు చదువు కంటే గేమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంత కాలంగా పబ్ జి.. ఈ గేమ్ చాలా చాలా మంది పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పబ్ జి గేమ్ కి అడిక్ట్ అయ్యారు అంటే ఇక అంతే తిండి తిప్పలు లేకుండా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేకుండా పొద్దున్న లేచినప్పటి నుండి గేమ్ లో మునిగి  తేలుతున్నారు.ఒక వైపు ఈ  ఆన్‌లైన్ గేమ్స్ కుటుంబాలను కూల్చేస్తున్నాయి. లోకజ్ఞానమే తెలియని పిల్లలు.. ఆ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల గుల్ల చేస్తున్నారు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అందినకాడికి దోచిపెడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా మారి.. సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలు.. తమ తల్లికి తెలియకుండా ఆమె ఖాతా నుంచి లక్ష రూపాయలకు పైగా విత్ డ్రా చేసుకున్నారు. అది తెలియక ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ భర్త ఉద్యోగం రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కోజికోడ్‌లోనే నివాసం ఉంటోంది. ఇద్దరూ పిల్లల్లో ఒకరు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. మరొకరు పదవ తరగతి చదువుతున్నారు. కరోనా వచ్చిన అందరి జీవితాలను కింద మీద చేసినట్లు. వీళ్ళ కుటుంబం లో కూడా కరోనా ప్రభావం లేకపోలేదు. లాక్ డౌన్ కారణంగా పిల్లలకు  ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. దాంతో ఆ తల్లి.. తన పిల్లలిద్దరికీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఇచ్చింది. ఇక అంతే.. పిల్లలు పాఠాలు వినడం పక్కన పెట్టి. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు.  నిత్యం  గేమ్స్ ఆడుతుండేవారు. ముఖ్యంగా నిషేధిత ‘పబ్‌జి’ ఆటకు అడిక్ట్ అయ్యారు ఆ పిల్లలిద్దరు. ఆటలో భాగంగా నెక్ట్స్ లెవల్‌కి చేరడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పిల్లలు తమ తల్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అలా.. ఆమె ఖాతా నుంచి పలు దాఫాలుగా లక్ష రూపాయలకు పైగా డబ్బులు డ్రా చేశారు.

ఇది తెలియని ఆ తల్లి డబ్బులు పోయాయనుకుని కోజికోడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు. పబ్‌జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు గుర్తించారు. విషయాన్ని బాధితురాలికి తెలియజేశారు. అది తెలిసి ఆవిడ కూడా షాక్ అయ్యారు. ఇది విషయం పిల్లలకు ఫోన్ ఇస్తే చదువుతున్నారు అని మనం అనుకుంటాం కానీ అది ఏ కుటుంబంలో జరగదు..