Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నమిత్ శర్మ అక్రమాలపై ఆరా తీస్తున్న పోలీసులు
posted on: Mar 17, 2026 6:32PM

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నమిత్ శర్మ అక్రమాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నమిత శర్మ గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.. నమిత్ శర్మ ఒక చీటర్ అని, రాజకీయ సంబంధాలు ఉన్నట్టు చెప్పి పలువురిని నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలతో పరిచయాలు పెంచుకుని ఆర్థిక లావా దేవీలు జరిపినట్లు విచారణలో బయటపడింది.
ఉన్నతస్థాయి రాజకీయ నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, స్థానిక రాజకీయ నాయకులను టార్గెట్ చేసి డబ్బులు దోచుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదట తనను తాను ఎంపీ, ఎమ్మెల్యే లేదా ప్రజాప్రతినిధిగా పరిచయం చేసుకుని, తర్వాత ప్రముఖ నాయకులతో పరిచయం కల్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకునే విధంగా మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నమిత్ శర్మను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.






