Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెమ్మసానికి ప్రమోషన్.. కింజరాపుకు శాఖ మార్పు?.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మోడీ కసరత్తు
posted on: Mar 29, 2026 8:19AM

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారా? మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులతో పాటు.. కొందరికి ఉద్వాసన, మరొ కొందరికి చోటు కల్పించనున్నారా? అంటే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఔననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆరంభించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా మోడీ తన కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు ఉండే మంత్రులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీకి చెందిన మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడుల శాఖలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖను సైతం మారుస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఖాయమంటున్నారు. ఆయనకు స్వతంతర హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చి అంతకంటే ప్రాధాన్యత ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి అదనంగా మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం ఎంపీ హరీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అదలా ఉంచితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన తప్పదని కూడా తెలుస్తోంది. అలా ఉద్వాసన పలికిన మంత్రులకు పార్టీ పదవులు అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.






