విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ ముందు గోరంట్ల మాధవ్ హైడ్రామా..

గోరంట్ల మాధవ్ గురువారం (మార్చి 6) సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో వాస్తవానికి పోలీసుల నోటీసుల ప్రకారం గోరంట్ల మాధవ్ బుధవారం (మార్చి 5)విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు పోలీసులు గురువారం విచారణకు హాజరు కావడానికి అనుమతి ఇచ్చారు.   దీంతో గురువారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ కు విచారణకు వచ్చిన గోరంట్ల మాధవ్ అక్కడ నానా హంగామా చేశారు. ఏదైనా కేసులో పోలీసు విచారణకు ఎవరైనా సరే ఒక్కరే హాజరు కావాలి. పోలీసులు అనుమతిస్తే ఒక లాయర్ ను వెంట తెచ్చుకోవచ్చు. అయితే గోరంట్ల మాధవ్ మాత్రం తనలో ఓ పది మంది లాయర్లను తీసుకువచ్చారు. తనతో పాటు వారందరినీ కూడా అనుమతించాలంటూ పట్టుపట్టారు. పోలీసులు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు గోరంట్ల మాధవ్ తో పాటు ఒక లాయర్ ను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసినా కూడా గోరంట్ల మాధవ్, ఆయనతో పాటు వచ్చిన లాయర్లు వాగ్వాదం కొనసాగించడంతో ఒక దశలో పోలీసులు ఒక్క లాయర్ ను కూడా అనుమతించేది లేదని తెగేసి చెప్పడంతో  చివరికి  దిగివచ్చిన గోరంట్ల మాధవ్ ఒకే ఒక్క లాయర్ తో విచారణకు హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ గతంలో పోలీసు అధికారిగా పని చేశారు.  నిందితుడిగా విచారణకు హాజరయ్యే వ్యక్తి తన వెంట ఎవరిని తీసుకువెళ్ల వచ్చు అనే విషయం తెలియకుండానే ఆయన అంత కాలం పోలీసు అధికారిగా ఉద్యోగం వెలగబెట్టారా? అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. 
విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ ముందు గోరంట్ల మాధవ్ హైడ్రామా.. Publish Date: Mar 6, 2025 4:11PM

పోసాని తర్వాత ఎవరంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాంపియన్స్ ట్రోఫీలో విజేత ఎవరన్న ఉత్కంఠ కంటే.. వైసీపీ హయాంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై బూతులతో రెచ్చిపోయిన నేతల అరెస్టులపైనే ఎక్కువ ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఔను దేశమంతా ఇప్పుడు క్రికెట్ ఫీవర్ తో ఉంది.  చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా వరుస విజయాలతో ఫైనల్స్ కు చేరుకుంది. ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో తలపడుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ సునాయాస విజయాలతో దుమ్ము లేపిన టీమ్ ఇండియా ఫైనల్స్ లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడో సారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందా, లేదా చివరిమెట్టు మీద తడబడి న్యూజిలాండ్ కు దాసోహం అంటుందా అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా కింగ్ కోహ్లీ తన పూర్వ ఫామ్ ను అందిపుచ్చుని చెలరేగి ఆడుతుండటంతో దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ చర్చే జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్రికెట్ మానియా పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ అందరి దృష్టి పోసాని తరువాత ఎవరు? జగన్ హయాంలో నోటికొచ్చినట్లు దుర్భాషలాడి రెచ్చిపోయిన నేతలలో పోసాని తరువాత అరెస్టయ్యేది ఎవరు? కోడాలి నాని, గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హూ ఈజ్ నెక్స్ట్ అన్న ఉత్కంఠే, ఆసక్తే కనిపిస్తోంది.  అయితే తరువాత వంతు దువ్వాడ శ్రీనివాస్ దే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. ఇందుకు రాజకీయాలలో పరుష వ్యాఖ్యలకు దూరంగా ఉండే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు.  నిజమే జగన్ హయాంలో వైసీపీ నాయకులు బరితెగించారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడంలో ఆరితేరిపోయారు. నరం లేని నాలుక కదా ఏం మాట్లాడినా చెల్లిపోతుం దన్న ట్లుగా నోటికి హద్దూ పద్దూ లేకుండా బూతుల పంచాంగం విప్పి మరీ తెలుగుదేశం, జనసేన అగ్రనాయకులపై తిట్ల దండకంతో రెచ్చిపోయారు. అలా ఇష్టారీతిగా మాట్లాడిన వారిలో  వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఒకరు.   ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుంటూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మాణిక్యాల రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దువ్వాడను విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విషయానికి వస్తే.. పోసాని కృష్ణమురళిపై కూడా జనసేన అధినేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పుడు అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ పై కూడా పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే కేసు నమోదైంది. దీంతో ఆయనను విచారించి అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బూతుల పంచాంగంతో వైసీపీ హయాంలో రాజకీయాలను కలుషితం చేసిన నేతల అరెస్టుల పట్ల సామాన్య జనంలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. అందుకే వంశీ, పోసానిల అరెస్టులను జనం స్వాగతించారు. నెక్స్ట్ ఎవరంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
పోసాని తర్వాత ఎవరంటే..? Publish Date: Mar 6, 2025 3:28PM

లగచర్ల, హకీంపేట భూ సేకరణపై హైకోర్టు స్టే 

నిరుడు లగచర్ల, హకీం పేటలో భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం  జారీ చేసిన నోటిఫికేషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం  ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది.  వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి భూములను సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకించారు. కలెక్టర్ మీద కూడా దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటనలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణలో సంచలనమైన భూసేకరణ నోటిఫికేషన్ రేవంత్ సర్కార్ రద్దు చేసుకుంది. ఫార్మా కంపెనీ కోసం కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం  ప్రభుత్వం సంసిద్దమైంది.  మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది.  లగచర్లలో భూ సేకరణను  వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టునాశ్రయించారు. భూ సేకరణ నిలుపుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. హకీంపేటలో కూడా  భూసేకరణ కోసం ప్రభుత్వం  నోటిఫికేషన్  ఇచ్చింది.  శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టులో నాశ్రయించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాలని  కోరారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు కోసం 351 ఎకరాల భూసేకరణకు  ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదంటూ పిటిషనర్ ఆరోపించారు.  హైకోర్టు  గురువారం నాడు ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటీసులపై స్టే విధించింది. రైతుల నుంచి భూములను సేకరించకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
లగచర్ల, హకీంపేట భూ సేకరణపై హైకోర్టు స్టే  Publish Date: Mar 6, 2025 2:58PM

జగన్ ‘నేను’.. చంద్రబాబు ‘మనం’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమష్టి తత్వంతో  ముందుకు సాగుతారు. అందరినీ కలుపుకుపోతే విజయాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతారు. కలిసుందాం రా అంటూ అదరినీ కలుపుకుపోతారు చంద్రబాబు. ఏ విషయంలోనూ దాపరికం ఉండదు. పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తారు. ఇదే ఆయనను నాలుగున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాలలోనే ఒక ఆదర్శవంతమైన నేతగా నిలుపుతూ వస్తున్నది. ఎన్నికలలో జయాపజయాలతో సంబంధం లేకుండా విలువలతో కూడిన రాజకీయాలను నెరపడంలో ఆయనకు ఆయనే సాటి.  అయితే గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన జగన్ వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నం. అన్ని విషయాలలోనూ ఆయన ఏక్ నిరంజన్ అన్నట్లుగానే వ్యవహరిస్తారు. అందుకే ఒక్క విజయంతో విర్రవీగిపోయిన జగన్.. ఒక్క పరాజయంతోనే పతనానికి చేరుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, విభజన కష్టాలలో నిండా మునిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఐదేళ్లలోనే అభివృద్ధి నమూనాగా నిలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని పరుగులెత్తించి ప్రపంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయగలిగారు. 2014 నుంచి 2019 విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని  ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు చేయించారు. ప్రతి సోమవారంను పోలవారంగా ప్రకటించి వరుస సమీక్షలతో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పైగా పూర్తి చేయించారు. ఇక కేంద్రంతో తరచూ భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరిపారు. ఆ చర్చలన్నీ పారదర్శకంగా ఉండేవి. ప్రధాని మోడీలో భేటీకి ఆయన  ఒంటరిగా కాకుండా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లే వారు. చర్చించిన అంశాలు, దాని ఫలితం అన్నిటినీ మీడియాకు వెల్లడించేవారు. సరే 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ మాత్రం ఎక్ నిరంజన్ అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పురోగమించడం అటుంచి తిరోగమనంలో సాగింది. ఆయన హస్తిన పర్యటనలన్నీ రహస్యోద్యమాలే. ఆయన కేంద్రం పెద్దలతో భేటీకి ఒంటరి యాత్రలే చేసేవారు. ఆ భేటీల్లో చర్చించిన అంశాలేమిటి? ఫలితం ఏమిటి వంటి విషయాలను ఆయన మీడియాకు వెల్లడించిన సందర్భమే లేదు. తరువాత ఎప్పుడో  తాపీగా ఒక ప్రెస్ నోట్ మాత్రం విడుదలయ్యేది. అంతే.. ఇప్పుడు తాజాగా చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆ భేటీలకు ఆయన కూటమి ఎమ్మెల్యేలను వెంట తీసుకుని వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్త మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు జరిపిన వరుస భేటీలలో ఆయనతో పాటు కూటమి పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రులతో  చర్చించిన అంశాలేమిటి? వాటిపై కేంద్ర మంత్రుల స్పందన ఏమిటి? అన్న విషయాలన్నిటినీ చంద్రబాబు మీడియాకు వివరించారు.  అదే జగన్ విషయానికి వస్తే సీఎంగా ఆయన పలుమార్లు హస్తిన పర్యటించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కానీ ఏ భేటీలోనూ ఆయన వెంట అప్పట్లో వైసీపీ నేతలు కానీ, ఎంపీలు కానీ లేరు. ఆఖరికి అప్పట్లో ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన విజయసాయిరెడ్డి కూడా ఉండేవారు కాదు. జగన్ వెంట వారంతా మంత్రుల నివాసాల వరకూ మాత్రమే తమ అధినేత వెంట ఉండటానికి అవకాశం ఉండేది. లోపలికి మాత్రం జగన్ ఏక్ నిరంజన్ అన్నట్లుగా ఒక్కేడే వెళ్లే వారు. అక్కడ ఆయన చర్చించిన అంశాలేమిటి? అన్నది బ్రహ్మ రహస్యంగానే ఉండేవి. ఇదీ చంద్రబాబుకు, జగన్ కు ఉన్న తేడా. జగన్ ‘నేను’ అన్న అహంతో వ్యవహరించేవారు. చంద్రబాబు మాత్రం ‘మనం’ అన్న సమష్టితత్వాన్ని చాటారు, చాటుతున్నారు. 
జగన్ ‘నేను’.. చంద్రబాబు ‘మనం’ Publish Date: Mar 6, 2025 2:42PM

చాంపియన్స్ ట్రోఫీఫైనల్స్‌కి టీమ్ ఇండియాకు షాక్?.. గాయంతో హార్థిక్ పాండ్యా ఔట్?!

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌కు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. సెమీస్‌లో భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన హార్దిక్‌పాండ్యా ఫైనల్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది.  ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరో వైపు రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.  అదలా ఉంటే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలుకు గాయం అయింది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది.  ఆ తర్వాత హార్దిక్ పరుగులు సాధించడంలో కొంత ఇబ్బంది పడినట్టు కనిపించాడు. అయితే ఆ తర్వాత అద్భుతమైన సిక్స్‌లతో మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు.గతంలో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు అది మళ్లీ తిరగబెట్టిందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.  ఒకవేళ గాయం తీవ్రతరమైనది అయితే కనుక ఫైనల్ మ్యాచ్‌కు అతను దూరం కావాల్సి ఉంటుంది. ఇది ఫైనల్‌కు ముందు భారత జట్టు ఆందోళనలను పెంచుతుందనడంలో సందేహం లేదు.అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చాంపియన్స్ ట్రోఫీఫైనల్స్‌కి టీమ్ ఇండియాకు షాక్?.. గాయంతో హార్థిక్ పాండ్యా ఔట్?! Publish Date: Mar 6, 2025 2:11PM

పోక్సో కేసులో విజయవాడ పోలీసుల విచారణకు గోరంట్ల 

వైకాపా నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు.  పోలీసులు పది ప్రశ్నలను గోరంట్ల మాధవ్ ముందు పెట్టారు. వాటి సమాధానాలను పోలీసులు స్టేట్ మెంట్ రూపంలో తీసుకున్నట్టు సమాచారం. ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం  అత్యాచార  బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలి.  కానీ మాధవ్ అత్యాచార బాధితుల పేర్లను బయటపెట్టారు. పోక్సో క్రింద మాధవ్ పై గత ఏడాది నవంబర్ 2న వాసిరెడ్డి   పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ విచారణకు హాజరు కావాలని  విజయవాడ  పోలీసులు మాధవ్ కు నోటీసులు పంపించారు. మాధవ్  విచారణకు హాజరయ్యారు. పోలీసు విచారణకు తాను  పూర్తిగా సహకరిస్తానని గోరంట్ల  మీడియాతో చెప్పారు
పోక్సో కేసులో విజయవాడ పోలీసుల విచారణకు గోరంట్ల  Publish Date: Mar 6, 2025 2:02PM