పెండింగ్’లో పీఅర్సీ  ఉద్యోగులకు పాత జీతాలే 

పీఅర్సీ సవరణతో పెరిగిన జీతాలు అందుకునేందుకు, ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం మరో మారు నీళ్ళు చల్లింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరీ ముఖ్యమంత్రి, చంద్రశేఖర రావు, గత మార్చిలో జరిగిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో పీఅర్సీ ప్రకటన చేశారు.  30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి సవరించిన పీఆర్సీ అమలులోకి వస్తుందని ముఖ్యంత్రి శవంగా సభలో ప్రకటించారు. అయితే, మే నెలలలో పెరిగిన జీతాలపై ఆశలు పెంచుకున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. గతంలోలోనూ పీఆర్సీ ఇలా ఒక నెల లేటుగా అమలైన సందర్భాలు ఉన్ననేపధ్యంలో, కనీసం జూన్ నెలలో అయినా ఎరియర్స్’తో సహా పెరిగిన జీతాలు వస్తాయని అనుకుంటే, తాజా సమాచారం ప్రకారం, ఇంత  వరకు పీఆర్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకమే కాలేదు. జీవోలు జారీకాలేదు. అంటే, జూన్ నేలలోనూ పాత జీతాలే, వస్తాయని, ఉద్యోగులు ఉసూరు మంటున్నారు.   

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’కు కోవిడ్ సోకడంతో  ఆయన 20 రోజులకు పైగా, ఫార్మ్ హౌస్ ‘కే పరిమితం అయ్యారు. ఈ కారణంగా పీఅర్సీ   ఫైల్ పెండింగ్’లో పడిందని, ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఉద్దేశ పూర్వకంగానే ముఖ్యమంత్రి ఫైల్’ ను పెండింగ్’లో పెట్టారని ఉద్యోగులు అనుమానిస్తున్నారు.మరోవైపు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పెరిగిన వేతనాలను ప్రస్తుతానికి ఇచ్చే ఇచ్చే పరిస్థితి లేదని,  పాత వేతనాల ప్రకారమే బిల్లులు రెడీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు మౌఖిత ఆదేశాలు అందినట్లు ఉద్యోగ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో, పీఆర్సీ కి మోక్షం ఎప్పుడో ... అసలు వస్తుందో, రాదో అని కూడా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.