పేద ప్రజల ఆరోగ్యం పట్టదా?

దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అది మన పాలనా విధానం కావాలి.....

2౦19 లో కోవిడ్ వచ్చిన తరువాత కూడా మనదేశ ప్రజలకి ఇది మనదేశం లో సమగ్ర ఆరోగ్యవిధనమంటూ ప్రకటించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి. 2౦19 లో వచ్చిన ఉపద్రవం నుంచి మనం నేర్చుకున్న గుణపా టాలు ఏమిటి ? తీవ్రంగా తరుముకొస్తున్న వైరస్ ను గుర్తించడం వాటికి తగ్గట్టుగా మనం యుద్ధానికి ఎలా సన్నద్ధం కాగలం ఎక్కడ నుంచి వచ్చిన్నా యుద్ధం చేయాలంటే మనకంటూ యుద్ధనీతి ఉండాలి కదా ? అసలు ఏ పద్దతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్న ప్రకటన లు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్ధికంగా వెనక పడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ఎలా ఉంది వాళ్ళ అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో కార్పోరేట్ ఆసుపత్రుల లో వైద్యం పేదలకి అందని ద్రాక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల లో సౌకర్యాలు లేక రోగిని వెక్కి రిస్తాయి. రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తాను చెప్పిదే వేదం అన్నట్లుగా తాను చేసిందే వైద్యం అన్న చందం గా సాగిపోతోంది. అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏ మిటి అన్నదే ప్రశ్న? నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్ట దన్నట్లు జిల్లా ఆసుపత్రి కి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు.

అలా నొప్పులు పడుతున్న సగటు గర్భిణి అన్నీ తిరిగే లోపు పిల్లాడిని కానీ చనిపోతుంది. లేదా పుట్టిన పిల్లవాడు పిల్ల చనిపోతుంది లోపం ఎక్కడా ఉంది సమస్యలు వచ్చినా తెలిసినా ప్రతినిధులు ఆరోగ్యా అధికారులు చర్యలు చేపట్టరు. అక్కడ వైద్యుల దారి వారిదే రోగుల దారి వారిదే అన్నట్లు ఉటుంది. గ్రామీణ అజెన్సీ లలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు రారు మందులూ ఉండవు. ముఖ్యంగా సీజన్ వస్తున్న దోమతెరలు ఇవ్వరు. మందులూ ఉండవు. గట్టిగా రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు.అక్కడ ఆరోగ్య కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నాడని. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు. ప్యాం డమిక్ తరువాత అయినా కనీస సౌకర్యాలు కల్పించక పోవడం పై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి. కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ  ఆరోగ్య సేవలు మాటలకే పరిమిత మయ్యాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక

ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి?

అన్న ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు ఇతరులతో పోలిస్తే మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ వేరొకరితో పోల్చుకుంటూ బతికేస్తారు. మీ సమర్ధతకు నిదర్శనాలు ఇవే వీటి గురించి ఒక్కసారి చూద్దాం. దేశంలో కోవిడ్ కేసులు త్వరిత గతిన పెరుగుతున్నాయి. వీటి విస్తరణను నియంత్రించడానికి మీ ప్రణాళిక ఏమిటి కేవలం కొన్ని నిబందనలు అమలు చేస్తే చాలా? ఒమేక్రాన్ నియంత్రించే యాంటి బాడీలు లను శాస్త్రజ్ఞులు గుర్తించారు అవి వాటి ఫలితాలు ఎప్పటికి అందేను. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి అన్నది ఇంకా పూర్త్జిగా చెప్పలేని స్థితి. కోవిడ్ ను  యంత్రించడానికి మేమే వ్యాక్సిన్ కనుక్కోనాం అని చెప్పుకున్నాం ఎనిమిది వ్యాక్సిన్లు నాలుగు చికిత్సలు గా సాగుతుంది. మహారాష్ట్రా, దిల్లో లో అప్పుడు కోవిడ్ ఇప్పుడు ఓమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎప్పుడు ముందుగా నమోదు అయ్యేది పెద్దసంఖ్యలో బాదితులు ఉండేది పెద్దనగారాల లోనేనా అంటే ఆర్ధికంగా దేబ్బతీయడానికి ఏదైనా కుట్ర లేదుకదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.  

నియంత్రణ లోపమ నిఘా లోపమా చెప్పాలి. పోస్ట్ కోవిడ్ తరువాత అనారోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఒక సవాల్ గా మారింది. అసలు ఈ సమస్యకు ఇదే చికిత్స అని నిర్దిష్టంగా చెప్పలేని వైద్యులు శాస్త్రజ్ఞులు ఉన్నారు. 695 ఆసుపత్రులు క్లినిక్లు రైల్వే స్ కు సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసారు. అక్కడితో ఆపని పూర్తి అయిపొయింది. కోవిడ్ చికిత్సకు నాట్కో ఫార్మా మోలో ను పిరావిడ్ క్యాప్సుల్ ను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 16. 67 కోట్లు వినియోగించని వ్యక్సిన్ల నేటికీ అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించే విషయంలో ప్రభుత్వం ఏమిచేయాలని అనుకుంటుంది. కోవ్యక్సిన్ తీసుకున్న వారు కోవి షీల్డ్ బెటర్ బూస్టర్ గా పేర్కొన్నారు డాక్టర్ షాహీద్ జమీల్ వైరాలజిస్ట్ టెక్నాలజీ వృద్ధి సాధించారు. గుర్గాం ఆసుపత్రిలో కోవిడ్ రోగులకి 25% బెద్స్ కావాలంటూ డిమాండ్ చేసారు. మీరట్ లో సర్జరీ తరువాత 27 మందికి కంటి చూపు కోల్పోయారు.అంటే చికిత్స లో లోపమా అంత పెద్దమోతం లో కంటి చూపు పోయిన వారికి అంధత్వం ప్రసాదించిన ఘనకర్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి. 

ఫార్మా రంగం....

కార్చి వ్యాక్స్ బూస్టర్ గా క్లినికల్ ట్రైల్స్ నడుస్తున్నాయి. అసలు ఒమేక్రాన్ ను ఎదుర్కోగలిగిన సమార్ధవంత మైన వ్యాక్సిన్లు లేవాకోవేక్సిన్ కు ప్రత్యామ్నాయం లేదా లేదా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేయడం సాధ్యం కావడం లేదా. కోవిడ్ వ్యాక్సిన్ విధానం డోసుల విషయం లో జాగ్రత లేదా సంరక్షణ బద్రత  అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందా. యు ఎస్ భారత్ సంయుక్తంగా ఆరోగ్య రంగం లో కృషి చేయాల్సి ఉంది.డొమెస్టిక్ ఫార్మా కంపెనీలు మేర్క్స్ కోవిడ్ పిల్ ఉత్పత్తి కి సిద్ధమయ్యాయి. కోవిడ్ తో మనం కలిసి సహజీవనం చేయాల్సిందే. అని డబ్ల్యు హెచ్ ఓ చేసిన ప్రకటన వాస్తవనేనా. కోవిడ్ 19 మిగిల్చిన భయంకరమైన అనుభవం తో నైనా మనం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. కోవిడ్ ను ఎదుర్కోడానికి మరిన్ని వ్యక్సిన్ల పై పరిశోదనలు సాగాలని త్వరిత గతిన వైరస్ అంతానికి పరిశోదనలు సాగించాల్సిన అవసరం ఉంది.ఆదిశగా ప్రయాత్నం సాగిస్తారని ఆశిద్దాం. న్యూట్రిషియన్, సంబందిత అనారోగ్యం, కిడ్నీ రోగులకు, ఫ్రీ కాప్సియా,గర్భిణీ స్త్రీలు ఇతర హైపర్ టేన్సివ్ డిజాస్టర్. వంటి సమస్యలు. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శస్త్ర చికిత్స సమస్య కు సరైన నూతన విధానం ప్రజలకు చౌకైన మెరుగైన ఉచిత వైద్య విధానం అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. అందుకే ఎ ప్రభుత్వమైనా రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సామాగ్ర ఆరోగ్య విధానం తో ప్రజలముందుకు రావాలని ఆశిద్దాం. .