Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పూనమ్ సంచలన కామెంట్లు... జల్సా చూపిస్తాడు.. అజ్ఞాతవాసంలో వేస్తాడు..
posted on: May 25, 2018 5:51PM
.jpg)
నిన్నటి వరకూ శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లు సినీ పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల నుండి ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఓ రకంగా దీనంతటికీ పవన్ కళ్యాణే కారణమని చెప్పొచ్చు. మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మీడియా కూడా కాస్త వెనక్కి తగ్గి.. అదే పనిగా డిబెట్లు పెట్టడం ఆపేశారు. ఇక డిబెట్లు లేకపోవడం.. ఇంటర్వ్యూలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు కూడా పెద్దగా వార్తలు లేకుండా పోయాయి. అయితే మరోసారి నెటిజన్లకు మంచి న్యూస్ దొరికింది. ఈసారి ఈ న్యూస్ కు కారణమయ్యింది ఎవరో కాదు పూనమ్ కౌర్.
నిజానికి అందాల కథానాయికే అయినా టాలీవుడ్ లో సరైన హిట్ కొట్టి నిలబడలేకపోయింది పూనమ్ కౌర్. ఫేడవుట్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, కత్తి మహేశ్ ఇష్యూతో వెలుగులోకి వచ్చింది. కత్తి మహేశ్ పవన్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పవన్ సపోర్ట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక ఆ తరువాత పూనమ్ కౌర్ ను ఉద్దేశించి కూడా కత్తి మహేశ్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనమ్ కౌర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని రోజులు ఈ విషయంపై చర్చలు జరిగినా... ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా తన ట్విట్టర్లో ఒక స్టార్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి ఈ భామ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జల్సాలు చూపిస్తూ.. అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త... నమ్మకద్రోహి అని పూనమ్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు... ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉంటూ... ఎన్నారై హీరోయిన్లను అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాడు... నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి... ఆ ఎన్నారై హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్లు ఉన్నాయా..? ఆ ఎన్నారై హీరోయిన్ మీరు ఏ పని చెప్పినా చాలా శ్రద్దగా చేస్తారట... నేను విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది అంటూ పూనమ్ తన ట్విట్టర్లో చాలా ఘాటుగానే కామెంట్లు విసిరింది. ఇక పూనమ్ కామెంట్లు చేసిన ఆ దర్శకుడు కూడా ఎవరికో దాదాపు క్లారిటీ వచ్చింది. మరి ముందు ముందు పూనమ్ ఇంకెంత మంది గురించి ఇలా కామెంట్లు చేస్తుందా.. లేకపోతే...దీంతో ఆపేస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో..



.jpg)


