రాజ‌కీయ‌మంటే విజిలేసినంత వీజీ కాదు విజయ్!

posted on: May 7, 2026 9:16AM

మొద‌టి సారి, అంటే క‌రూర్ తొక్కిస‌లాట జ‌రిగిన‌పుడు విజ‌య్ కి అస‌లు సిస‌లు రాజ‌కీయ‌మేంటో అర్ధ‌మైంది. ఆ త‌ర్వాత జ‌న‌నాయ‌గ‌న్  సినిమా విడుదలని ఆపిన‌పుడు కూడా కాస్త పొలిటిక‌ల్ ప‌వ‌ర్ టేస్ట్ తెలిసింది. ఆపై తానెంత ముమ్మ‌ర  ప్ర‌చారంలో ఉన్నా కూడా సీబీఐ  విచార‌ణ‌ల పేరిట  వేధించినప్పుడూ.. అవగతమైంది.   ఇప్పుడు పొలిటిక‌ల్ మ‌షాళా పిక్చ‌ర్.. హౌస్ ఫుల్ హాల్లో కూర్చుని సెవెంటీ  ఎంఎంలో వీక్షిస్తున్నారు విజ‌య్.

అదెలాగంటే..  ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల  ఫ‌లితాల్లో   108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన  అవ‌స‌రం  క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ  ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి  ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే  11 కావాలి. 

స‌రే  కాంగ్రరెస్ ఓ ఐదు స్థానాలతో విజయ్ కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.  కాంగ్రెస్ తో పాటు, క‌మ్యూనిస్టుల‌కు మ‌రో నాలుగు, ముస్లిం లీగ్ కి ఉన్న  సీట్లు కూడా క‌లుపుకుంటే ఈజీగా మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేస్తుంది టీవీకే. కానీ ఇక్క‌డే డీఎంకే ఒక లాజిక్ లాగింది. కాంగ్రెస్ కి కానీ, క‌మ్యూనిస్టుల‌కుగానీ మాతో క‌లిసినందు వ‌ల్ల వ‌చ్చిన సీట్ల‌వి..  వాటిని తీసుకెళ్లి మా ప్ర‌త్య‌ర్ధి  పార్టీకి ఎలా ఇస్తార‌ని నిల‌దీసింది. 

దీంతో కాంగ్రెస్ ముందుకు వ‌చ్చినా.. క‌మ్యూనిస్టులు, ముస్లిం  లీగ్ వెన‌క్కు త‌గ్గాయి. ఇలాగ కాదని బీజేపీతో జ‌ట్టు క‌ట్టిన అన్నాడీఎంకేతో క‌లుద్దామ‌ని చూస్తే.. అందుకు ఆ పార్టీ ససేమిరా అంది.  అయితే..  విజ‌య్ త‌మ పార్టీలోకి వ‌చ్చిన‌ సెంగొట్ట‌య్య‌న్ అనే ఆ  పార్టీకి చెందిన  నేత‌ను రాయ‌బారానికి పంపారు. ఇది వ‌ర‌కు మాతో జ‌ట్టు క‌ట్టేది లేద‌ని తెగేసి చెప్పి.. ఇప్పుడు మ‌ళ్లీ కాళ్ల‌బేరానికి వ‌స్తే.. ఎలా అని నిలదీసింది అన్నాడీఎంకే.  

దీంతో ఏం చేయాలో దిక్కు తోచ‌క అగ‌మ్య గోచ‌ర స్థితిలోకి కూరుకుపోయారు విజ‌య్. మాతో ప్ర‌మాణ స్వీకార  కార్య‌క్రమం చేయించండ‌ని గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌నాథ్ ని వెళ్లి క‌లిస్తే..  ఆయ‌న  మ్యాజిక్ నెంబ‌ర్ చూపించి ముందుకెళ్లండని చెప్పి కేర‌ళ వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు విజ‌య్ ముందున్న ఆప్ష‌న్లేంటి? అనేది ఉత్కంఠ భ‌రితంగా మారింది. ఏదైనా మ్యాజిక్ జ‌రిగితే త‌ప్ప ఆయ‌న ప్ర‌మాణ  స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగేలా  క‌నిపించ‌డం లేదు. ఇటు మిగిలిన పార్టీలు కూడా ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చెప్పి బాగా బెట్టు చేస్తున్నాయి.

ఇప్పుడు విజ‌య్ ముందున్న ఆప్ష‌న్లేంటో చూస్తే, ఆప్ష‌న్ నెంబ‌ర్ వ‌న్ అన్నాడీఎంకే నుంచి కొంద‌రు ఎమ్మెల్యేల‌ను ఇటు వ‌చ్చేలా చేయ‌య‌డం. లేదంటే త్రిష ద్వారా అమిత్ షా ట‌చ్ లోకి వెళ్లి అన్నాడీఎంకేని ఒప్పించి అధికారంలోకి తీసుకోవ‌డం. లేదంటే లోపాయికారిగా ఎమ్మెల్యేల‌ను కొన‌డం.  ఇవేవీ  కావంటే అస‌లు నావ‌ల్ల కాద‌ని గ‌వ‌ర్న‌ర్ కి చెప్పేయ‌డం. దీంతో కేంద్రం రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించ‌డం. ఆపై మ‌రోమారు ఎన్నిక‌లను నిర్వ‌హించ‌డం. ఇన్నేసి అంశాలు ఇందులో ముడి ప‌డి ఉన్నాయి.

ఒక వేళ విజ‌య్ గానీ  త‌న‌కు కావ‌ల్సిన  ఎమ్మెల్యేల‌ను ఇటు డీఎంకే, అన్నాడీఎం వంటి పార్టీల  నుంచి కొనుగోలు చేసినా.. ఆయ‌న నుంచి అవినీతి ర‌హిత పాల‌న ఆశించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నే కాదు. ఒక వేళ ఇవ‌న్నీ అధిగ‌మించి ప్ర‌భుత్వంలోకి వ‌స్తే ఆయ‌న ముందున్న అతి పెద్ద గుదిబండ ఆయ‌న ప్ర‌క‌టించిన హామీలు. వాటిని నెర‌వేర్చ‌డానికి ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు తేలుతోంది. దీంతో విజ‌య్ కి ముందు నుయ్యి- వెన‌క గొయ్యి క‌నిపిస్తోంది. అందుకే పొలిటిక్స్ అంటే అంత విజిల్ వేసినంత వీజీ కాదు.. త‌న గోట్ సినిమాలో టీఎన్ సీఎం 2026 అనే నెంబ‌ర్ ప్లేట్ వేయించుకున్నంత సుల‌భ‌మూ కాద‌ని  సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...