ఎన్టీఆర్‌, స‌త్య‌సాయి, బాలాజీ, అన్న‌మ‌య్య‌.. జిల్లాల పేర్ల‌తో జ‌గ‌న‌న్న కొత్త రాజ‌కీయం!!

ఏపీలో కొత్త జిల్లాలు వ‌స్తున్నాయి. అవి వ‌స్తాయో లేదో డౌట్‌గానే ఉన్నా.. ప్ర‌భుత్వ గెజిట్ నోటిఫికేష‌న్ మాత్రం విడుద‌లైపోయింది. ఉన్న‌ట్టుండి ఇప్పుడే కొత్త జిల్లాలు ఎందుకండి? అని అమాయ‌కంగా ప్ర‌శ్నించ‌కండి. పీఆర్సీ తేనెతెట్టును క‌దిలించి.. ఉద్యోగులతో శాప‌నార్థాలు పెట్టించుకుంటున్న జ‌గ‌న‌న్న‌.. ప్ర‌జ‌ల దృష్టిని అటునుంచి మ‌ర‌ల్చ‌డానికే ఈ కొత్త జిల్లాల య‌వ్వారం తెర‌మీద‌కు తీసుకొచ్చార‌ని అంటున్నారు. స‌రే.. తెచ్చిందేదో తెచ్చేశారు.. ఇక‌, ఆ జిల్లాల పేర్ల‌తో జ‌గ‌నన్న జ‌బ‌ర్ద‌స్త్ పొలిటిక‌ల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. 

కృష్ణా జిల్లాను.. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్పు చేయ‌నుంది స‌ర్కారు. కృష్ణాకు ఎన్టీఆర్ పేరు త‌గిలించ‌డం.. రాజకీయం అన‌క ఇంకేమంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీని, చంద్ర‌బాబును కార్న‌ర్ చేసేలా.. ఎన్టీఆర్‌కు మీరేమీ చేయ‌లేదు.. మేము ఆయ‌న పేరును జిల్లాకు పెట్టామ‌ని పొలిటిక‌ల్ అడ్వాంటేజ్ పొందేలా.. ఈ నేమ్ గేమ్ ఆడుతున్నార‌ని అంటున్నారు. ఇక‌, పాడేరుకు అల్లూరు సీతారామ‌రాజు జిల్లా అని.. పుట్ట‌ప‌ర్తి ప్రాంతానికి శ్రీస‌త్య‌సాయి జిల్లా అని.. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా.. తిరుప‌తి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా అంటూ..  కొత్త పేర్ల‌తో కొత్త జిల్లాల‌తో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌ని స్కెచ్ వేసిన‌ట్టుంది. అల్లూరు అభిమానులు, స‌త్య‌సాయి, వెంకన్న‌, అన్న‌మ‌య్య‌ భ‌క్తులు.. ఆ పేర్ల‌ను చూసి జ‌గ‌న‌న్నను అభినందించి.. ఓట్లు వేస్తార‌ని అనుకుంటున్నారో ఏమో..?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 26 వరకు కొత్త జిల్లాలపై అభిప్రాయాలు స్వీకరించనుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం కొత్త జిల్లాల వివరాలు....
1. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా
2. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా
3. అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా
4. కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా
5. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా
6. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా
7. ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా
8. మచిలీపట్నం కేంద్రంగా మచిలీపట్నం జిల్లా
9. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా
10. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా
11. బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా
12. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా
13. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా
14. తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా
15. నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా

కొత్త జిల్లాలు- రెవెన్యూ డివిజన్లు
1. శ్రీకాకుళం(రెవెన్యూ డివిజన్లు): టెక్కలి, శ్రీకాకుళం
2. విజయనగరం(రెవెన్యూ డివిజన్లు): బొబ్బిలి, విజయనగరం
3. మన్యం(రెవెన్యూ డివిజన్లు): పాలకొండ, పార్వతీపురం
4. అల్లూరి సీతారామరాజు(రెవెన్యూ డివిజన్లు): పాడేరు, రంపచోడవరం
5. విశాఖ(రెవెన్యూ డివిజన్లు): భీమునిపట్నం, విశాఖపట్నం
6. అనకాపల్లి(రెవెన్యూ డివిజన్లు): నర్సీపట్నం, అనకాపల్లి
7. తూ.గో(రెవెన్యూ డివిజన్లు): పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ(రెవెన్యూ డివిజన్లు): రామచంద్రాపురం, అమలాపురం
9. రాజమండ్రి(రెవెన్యూ డివిజన్లు): రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. నరసాపురం(రెవెన్యూ డివిజన్లు): నరసాపురం, భీమవరం
11. ప.గో(రెవెన్యూ డివిజన్లు): ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
12. కృష్ణా(రెవెన్యూ డివిజన్లు): గుడివాడ, మచిలీపట్నం
13. ఎన్టీఆర్‌(రెవెన్యూ డివిజన్లు): విజయవాడ, నందిగామ, తిరువూరు
14. గుంటూరు(రెవెన్యూ డివిజన్లు): గుంటూరు, తెనాలి
15. బాపట్ల(రెవెన్యూ డివిజన్లు): బాపట్ల, చీరాల
16. పల్నాడు(రెవెన్యూ డివిజన్లు): గురజాల, నరసరావుపేట
17. ప్రకాశం(రెవెన్యూ డివిజన్లు): మార్కాపురం, ఒంగోలు, కనిగిరి
18. నెల్లూరు(రెవెన్యూ డివిజన్లు): నెల్లూరు, అత్మకూరు, కావలి
19. కర్నూలు(రెవెన్యూ డివిజన్లు): కర్నూలు, ఆదోని
20. నంద్యాల(రెవెన్యూ డివిజన్లు): నంద్యాల, డోన్‌, ఆత్మకూరు
21. అనంతపురం(రెవెన్యూ డివిజన్లు): కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు
22. శ్రీసత్యసాయి(రెవెన్యూ డివిజన్లు): పెనుగొండ, పుట్టపర్తి, కదిరి
23. కడప(రెవెన్యూ డివిజన్లు): కడప, జమ్మలమడుగు, బద్వేల్‌
24. అన్నమయ్య(రెవెన్యూ డివిజన్లు): రాజంపేట, రాయచోటి, మదనపల్లి
25. చిత్తూరు(రెవెన్యూ డివిజన్లు): చిత్తూరు, పలమనేరు
26. శ్రీబాలాజీ(రెవెన్యూ డివిజన్లు): నాయుడుపేట, గూడూరు, తిరుపతి

జిల్లాలు-నియోజకవర్గాలు
1. విజయనగరం(నియోజకవర్గాలు): రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్‌కోట, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం
2. విశాఖ(నియోజకవర్గాలు): నార్త్‌ విశాఖ, సౌత్‌ విశాఖ, గాజువాక
3. అనకాపల్లి(నియోజకవర్గాలు): చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం
4. అరకు(నియోజకవర్గాలు): పాడేరు, అరకు, రంపచోడవరం
5. పార్వతీపురం(నియోజకవర్గాలు): పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం
6. శ్రీకాకుళం(నియోజకవర్గాలు): పలాస, టెక్కలి, పాతపట్నం,  ఎచ్చెర్ల, ఆముదాలవలస, నరసన్నపేట, శ్రీకాకుళం
7. కాకినాడ(నియోజకవర్గాలు): తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం
8. రాజమహేంద్రవరం(నియోజకవర్గాలు): రాజమండ్రి సిటీ, రూరల్‌, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం
9. అమలాపురం(నియోజకవర్గాలు): రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, పి.గన్నవరం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం
10. ఏలూరు(నియోజకవర్గాలు): దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఏలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు
11. నరసాపురం(నియోజకవర్గాలు): పాలకొల్లు, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం
12. మచిలీపట్నం(నియోజకవర్గాలు): పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, మచిలీపట్నం, పెనుమలూరు, గన్నవరం, గుడివాడ
13. విజయవాడ(నియోజకవర్గాలు): విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు
14. బాపట్ల(నియోజకవర్గాలు): వేమూరు, రేపల్లె, చీరాల, బాపట్ల, పర్చూరు, అద్దంకి
15. నరసరావుపేట(నియోజకవర్గాలు): సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ
16. గుంటూరు(నియోజకవర్గాలు): గుంటూరు ఈస్ట్, వెస్ట్‌, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ
17. ఒంగోలు(నియోజకవర్గాలు): సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, ఒంగోలు, మార్కాపురం, ఎర్రగొండపాలెం
18. నెల్లూరు(నియోజకవర్గాలు): నెల్లూరు సిటీ, రూరల్‌, కొవ్వూరు, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు
19. తిరుపతి(నియోజకవర్గాలు): శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి, తిరుపతి
20. చిత్తూరు(నియోజకవర్గాలు): పుంగనూరు, పలమనేరు, నగరి, చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు
21. కడప(నియోజకవర్గాలు): కమలాపురం, జమ్మలమడుగు, బద్వేల్‌, కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు
22. రాజంపేట(నియోజకవర్గాలు): తంబళ్లపల్లి, మదనపల్లి, రాయచోటి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు
23. నంద్యాల(నియోజకవర్గాలు): ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం
24. కర్నూలు(నియోజకవర్గాలు): పాణ్యం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ
25. హిందూపురం(నియోజకవర్గాలు): కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, మడకశిర
26. అనంతపురం(నియోజకవర్గాలు): రాప్తాడు, తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు, అనంతపురం, అర్బన్‌, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ.
 

Related Segment News