Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అక్రమ హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి.. 20 మంది అరెస్టు
posted on: Mar 21, 2026 9:49AM

కేఫ్ ల పేర హైదరాబాద్ లో అక్రమంగా నడుస్తున్న హుక్కాదందాపై పోలీసులు దృష్టి సారించారు. అక్రమంగా హుక్కా సెంటర్లు నిర్వహిస్తూ యువతను మత్తునకు బానిసలుగా మారుస్తున్న హుక్కా కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా శుక్రవారం (మార్చి 20) రాత్రి నోగోల్ లోని ఓ హుక్కా కేందరంపై దాడి చేసి 20 మందిని అదుపులోనికి తీసుకున్నారు. నాగోల్ లో బయటకు సాధారణ కేఫ్‌లా కనిపించే ఈ ఈ కేంద్రంలో హుక్కా దందా జరుగుతున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడిచేశారు.
ఈ దాడిలో ఈ కేఫ్ అనుమతులు లేకుండా హుక్కా సెంటర్‌నడుపుతున్నట్లు తేలింది. . యువతను ఆకర్షించేలా వివిధ రకాల ఫ్లేవర్లతో హుక్కా అందిస్తూ అక్రమ వ్యాపారం కొనసాగి స్తున్నట్లు వెల్లడైంది. చందానగర్, బీఎన్ రెడ్డి, వనస్థలిపురం తదితర ప్రాంతాల నుంచి కస్టమర్లు ఇక్కడికి తరచుగా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
దాడి సమ యంలో కేఫ్‌లో ఉన్న దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొబైల్ ఫోన్లతో పాటు 15 వాహనా లను స్వాధీనం చేసు కున్నారు. హుక్కా సామగ్రి, ఇతర సంబంధిత వస్తువు లను సీజ్ చేశారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు, హుక్కా సెంటర్ నిర్వహణ వెనుక ఉన్న వ్యక్తులపై ఆరా తీస్తున్నారు.


.webp)
.webp)


